శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 21, 2021 , 02:35:17

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

పెద్దపల్లి కమాన్‌, జనవరి 20: జాతీయస్థాయి క్రికెట్‌ (టెన్నిస్‌బాల్‌) పోటీలకు పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థి బాలసాని శ్రీకాంత్‌ ఎంపికైనట్లు ఆ విద్యా సంస్థ అధినేత అల్లెంకి శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్‌ ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి జట్టులో స్థానం దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో తమిళనాడులో నిర్వహించనున్న జూనియర్‌ సౌత్‌జోన్‌ టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొననున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థికి ప్రిన్సిపాల్‌ రవీందర్‌, అధ్యాపకులు, సిబ్బంది కళాశాలలో పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. కళాశాల, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. 


VIDEOS

logo