పనులను ప్రారంభించాలి: అదనపు కలెక్టర్

ఓదెల, జనవరి 19: జీలకుంట గ్రామంలో పల్లె ప్రకృతి వనం పనులను ప్రారంభించాలని అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సాయం త్రం జీలకుంట గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. స్థల వివాదంతో పనులు జరగడం లేదని సర్పంచ్ అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కమాన్‌పూర్, జనవరి 19: తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో గల ప్రభుత్వ భూముల వివరాల రికార్డులను కంప్యూటర్లో పరిశీలించారు. కమాన్‌పూర్, నాగారం, రొంపికుంట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి స్థల సమస్య ఏర్పడింది. ఆ సమస్యను పరిష్కరించడంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ భూములపై ఆరా తీశారు. అలా గే నాగారం, రొంపికుంట గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఎలిగేడు, జనవరి 19: ధూళికట్ట, ముప్పిరితోటలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు త్వరగా కేటాయించాలని అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తహసీల్దార్ పద్మావతిని ఆదేశించారు. మంగళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడ ఎంపీడీవో బద్రి శ్రీనివాస్‌మూర్తి, ఎంపీవో వీ అనిల్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.