శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 20, 2021 , 00:57:55

యువతను ప్రోత్సహించడానికే క్రికెట్‌ పోటీలు

యువతను ప్రోత్సహించడానికే క్రికెట్‌ పోటీలు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

క్రీడా సామగ్రి అందజేత 

సుల్తానాబాద్‌, జనవరి 19: యువతను క్రీడారంగంలో ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ క్రికెట్‌ కప్‌ పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. 

సుల్తానాబాద్‌ కళాశాల మైదానంలో పోటీల్లో పాల్గొనే జట్లకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఏకరూప దుస్తులతో పాటు, క్రీడా సామగ్రిని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు తమను సంప్రదిస్తే ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి నిష్ణాతులైన కోచ్‌లతో శరీర దారుఢ్యానికి సంబంధించి శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. ఈ పోటీల్లో మున్సిపల్‌ పరిధి నుంచి 15 జట్లు, మండలంలోని గ్రామాల నుంచి 26 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌, నాయకులు పాల రామారావు, ముత్యం రమేశ్‌, తాళ్లపెల్లి మనోజ్‌గౌడ్‌, ముస్త్యాల రవీందర్‌, అనంతరెడ్డి, పారుపెల్లి గణపతి, కోట రాంరెడ్డి, గుర్రాల శ్రీనివాస్‌, రేవెల్లి తిరుపతి, మొల్గూరి అంజయ్య, తిప్పారపు దయాకర్‌, కొయ్యడ అరుణ్‌, కూకట్ల గోపి, శీలం శంకర్‌, సాజిద్‌, సర్వర్‌, బండి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.     

VIDEOS

logo