శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 17, 2021 , 03:34:59

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోండి

రామగిరి, జనవరి 16: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థుల కోసం సింగరేణి ఆర్జీ-3లో చేపడుతున్న ఉచిత శిక్షణను యువకులు సద్వినియోగం చేసుకోవాలని జీఎం సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో ఉచిత శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.  ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులను జీఎం కార్యాలయంలో అందజేయాలని కోరారు.  

గోదావరిఖని, జనవరి 16: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఈ నెల 19వ తేదీ నుంచి గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీఎం నారాయణ తెలిపారు. ఈ మేరకు స్థానిక జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం త్యాగరాజు, అధికారులు నవీన్‌, రమేశ్‌, ఆంజనేయులు, మదన్‌మోహన్‌, బెనర్జీ బెంజిమన్‌, కాశీ విశ్వేశ్వర్‌, విశ్వమేధి, సారంగపాణి, శ్రీనివాస్‌, ఆంజనేయప్రసాద్‌ తదితరులున్నారు. 


VIDEOS

logo