శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 17, 2021 , 03:34:59

సీసీ కెమెరాలతో భద్రత మరింత మెరుగు

సీసీ కెమెరాలతో భద్రత మరింత మెరుగు

ఎలిగేడు, జనవరి 16: సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత మెరుగుకానున్నదని సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో జూలపల్లి ఎస్‌ఐ చంద్రకుమార్‌ శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి సీఐ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలిగేడు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ బూర్ల సింధూజ, కోరుకంటి వెంకటేశ్వరరావు రూ. 40వేలు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ తరఫున రూ. 40 వేలు, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ మండిగ రేణుక-రాజనర్సయ్య, ఎంపీపీ తానిపర్తి స్రవంతి-మోహన్‌రావు రూ. 25 వేల చొప్పున, వైశ్యసంఘం తరఫున రూ. 25 వేలు ఇస్తున్నట్లు తాటిపెల్లి రమేశ్‌, కేశెట్టి లింగమూర్తి రాఘవులు ప్రకటించారు. జీపీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ద్వారా రూ. 25 వేలు ఇస్తున్నట్లు మామిడాల రమేశ్‌ తెలిపారు. స్థానిక ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ తరఫున అధ్యక్షుడు శ్రీనివాస్‌, గ్రామానికి చెందిన మరో సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు నగదు విరాళాన్ని సర్పంచ్‌కు అందజేశారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘ గ్రామ గౌరవాధ్యక్షుడు బూర్ల సత్యనారాయణ, బీజేపీ మండలాధ్యక్షుడు మామిడాల రమేశ్‌, మాజీ సర్పంచ్‌ మండిగ రాజనర్సయ్య తదితరులున్నారు.

VIDEOS

logo