శనివారం 27 ఫిబ్రవరి 2021
Peddapalli - Jan 17, 2021 , 03:34:57

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

  • జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
  •  టీకా పంపిణీ ప్రారంభం

పెద్దపల్లి, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కరోనా నివారణ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. మొదటి టీకాను జిల్లా దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్‌ మందల వాసుదేవారెడ్డి వేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మహమ్మారిని తరిమికొడదాం

ఫర్టిలైజర్‌సిటీ, జనవరి 16: కరోనా మహమ్మారిని టీకాతో తరిమికొడదామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. ఈమేరకు గోదావరిఖని ప్రభు త్వ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం దవాఖాన ఆర్‌ఎంవో భీష్మ, వైద్యుడు శ్రీధర్‌, వైద్య సిబ్బందికి టీకాలను వేశారు. ఇక్కడ మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో కృపాబాయి, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు ఆముల నారాయణ, గోలివాడ చంద్రకళ, కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస రెడ్డి, వైద్యులు రాజశేఖర్‌ రెడ్డి ఉన్నారు. అలాగే లక్ష్మీపురం పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని బల్దియా కమిషనర్‌ ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బంది 30 మందికి కొవిడ్‌ నివారణ టీకాను వేశారు. ఇక్కడ కార్పొరేటర్‌ నీల పద్మాగణేశ్‌, రాకం లతాదామోదర్‌, వైద్యులు శంకరమ్మ, సీవో పారిజాతం తదితరులున్నారు.

ప్రభుత్వ చర్యలపై హర్షం

సుల్తానాబాద్‌, జనవరి 16: కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పనితీరు, తీసుకున్న జాగ్రత్తలు హర్షణీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో ఎమ్మెల్యే వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను  ప్రారంభించారు. కరోనా నివారణ టీకాను జిల్లా కొవిడ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీరాంనకు, అలాగే 20 మంది సిబ్బందికి వైద్యులు, సిబ్బంది టీకా వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, వైద్యులు చంద్రశేఖర్‌, తిరుమల తదితరులున్నారు.

VIDEOS

logo