బుధవారం 27 జనవరి 2021
Peddapalli - Jan 14, 2021 , 01:20:28

సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం

పెద్దపల్లిరూరల్‌, జనవరి 13: ముదిరాజ్‌ సొసైటీల్లో 18 ఏండ్ల వయసు నిండిన ప్రతి యువకుడికి సభ్యత్వం ఇచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముదిరాజ్‌లు హర్షం వ్యక్తం చేశారు. హన్మంతునిపేటలో బుధవారం సర్పంచ్‌ సదయ్య ఆధ్వ ర్యంలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఈటల రాజేందర్‌, ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి చిత్రపటాల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుర్రాల లక్ష్మి గట్టేశం, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు గుర్రాల సాయిలు, ఉపాధ్యక్షుడు తీగల కనుకయ్య తదిత రులున్నారు.

కోల్‌సిటీ, జనవరి 13: గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటంతోపాటు మంత్రి ఈటల రాజేందర్‌, మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌, ఎంపీ బండ ప్రకాశ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడు జిట్టవేన ప్రశాంత్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు సాగంటి శంకర్‌, తూడి రాజయ్య, గడ్డి కనకయ్య, దబ్బెట శంకర్‌, మేడి సదయ్య, రాజయ్య, మొగిలి, దండు రవీందర్‌, భిక్షపతి, ఆకుల రవి, నిమ్మల రవి, కొంతం తిరుపతి, సాగర్ల నరేశ్‌, కృష్ణ, ఓదెల కుమార్‌, కందుల శేఖర్‌, మొగిలి, కుమారస్వామి తదితరులున్నారు. 


logo