సింగరేణి సరికొత్త ‘సందేశం’

కార్మికులకు సమాచారం చేరవేతకు ‘ఎస్ఎంఎస్'కు శ్రీకారం
సంక్రాంతి శుభాకాంక్షలతో సీఎండీ తొలి మెస్సేజ్
కార్మికుల్లో హర్షం
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న సింగరేణి మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా కార్మికులు, ఉద్యోగులందరికీ ఏకకాలంలో చేరేలా ‘ఎస్ఎంఎస్' విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా తొలి ఎస్సెమ్మెస్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతోనే ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తొలి ఎస్ఎంఎస్ను పంపించారు. సింగరేణిలోని దాదాపు 45వేల 118మంది కార్మికులకు ఏ సమాచారాన్నైనా ఏకకాలంలో చేరవేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యం కేవలం నెల జీతం వేసిన సందర్భంలోనే ఉండేది. ఇకపై కార్మికులకు అవసరమయ్యే ఉన్నత స్థాయిలో తీసుకునే ఏ విధాన నిర్ణయానికి సంబంధించిన సమాచారమైనా అందరికీ తెలిసేలా గ్రూప్ ఎస్ఎంఎస్ని వినియోగించుకోవాలని సీఅండ్ఎండీ నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. కాగా, సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎస్ఎంఎస్ రాని ఉద్యోగులు వారి ప్రస్తుత సెల్ నంబర్‌ను సంబంధిత గని, డిపార్ట్మెంట్ వద్ద నమోదు చేసుకోవాల్సిందిగా కోఆర్డినేషన్ జీఎం కే. రవిశంకర్ సూచించారు.
తాజావార్తలు
- ‘సిగ్నల్’లో సాంకేతిక సమస్యలు
- టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..
- తెలంగాణ క్యాడర్‌కు 9 మంది ఐఏఎస్‌లు
- నాగోబా జాతర రద్దు
- బైడెన్ ప్రమాణస్వీకారం రోజు శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్
- హైకోర్టులో 10 జడ్జి పోస్టులు ఖాళీ
- నేటి నుంచి గొర్రెల పంపిణీ
- రాష్ట్రంలో చలి గాలులు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని