నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆయన మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. మధ్యలో గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి క్లాస్ సినిమాలు చేసినా కూడా ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. గతంలో బోయపాటితో చేసిన సింహా, లెజెండ్ సినిమాలలో కూడా ద్విపాత్రాభినయం చేశాడు బాలకృష్ణ. నటసింహంతో సినిమా చేయాలి అంటే కనీసం రెండు పాత్రలు ఉండాల్సిందే అంటున్నాడు బోయపాటి.
ఈయన మాత్రమే కాదు చాలామంది దర్శకులు బాలయ్యతో సినిమా అనగానే డ్యూయల్ రోల్ ఉన్న కథలనే తీసుకొస్తుంటారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా ఇదే చేస్తున్నాడు. ఈ మధ్యే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. వేటపాలెం నేపథ్యంలో పవర్ ఫుల్ కథను గోపీచంద్ మలినేని సిద్ధం చేశాడు. దానికి తోడు క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాపై ఇప్పుడు మరో అప్డేట్ బయటికి వచ్చింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోసం రెండు పవర్ ఫుల్ పాత్రల్ని డిజైన్ చేశాడు దర్శకుడు గోపిచంద్ మలినేని.
బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇదిలా ఉంటే ఇందులో ముగ్గురు హీరోయిన్లు బాలకృష్ణతో జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని ఏళ్లుగా బాలయ్య సినిమా అంటే కచ్చితంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండడం కామన్ అయిపోయింది. అఖండ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పుడు గోపీచంద్ సినిమాలో కూడా ఇదే రిపీట్ కానుంది. మరో వైపు రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రకు ప్రాణం పోసిన వరలక్ష్మి శరత్ కుమార్.. బాలయ్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. ఏదేమైనా కూడా బాలయ్య సినిమా అంటే అటు మాస్ అంశాలకు.. ఇటు హీరోయిన్ గ్లామర్ లకు ఏ మాత్రం తీసిపోదు. 2022 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
నితిన్ ‘జయం’కు 19 ఏండ్లు..ఆ రోజుల్లోనే సంచలన వసూళ్లు
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది