గురువారం 04 మార్చి 2021
Peddapalli - Jan 07, 2021 , 01:42:38

టీఆర్‌ఎస్‌తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

టీఆర్‌ఎస్‌తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పార్టీలో కాంగ్రెస్‌ నాయకుల చేరిక

పెద్దపల్లి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): టీఆర్‌ఎస్‌ హయాంలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుధవారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్‌ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునీతారమేశ్‌, సూర శ్యామ్‌, తిప్పారపు దయాకర్‌, పసెడ్ల సంపత్‌, సాజిద్‌, నరేశ్‌, వెంకటస్వామి, అరుణ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo