తెలుగింటి సీతమ్మగా గుర్తింపు తెచ్చుకున్న అంజలి రీసెంట్గా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అంజలి తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. అయితే చాలా రోజుల తర్వాత అంజలి వకీల్ సాబ్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం, ఈ సినిమా అమ్మడికి మంచి హిట్ అందించడంతో చాలా జోష్లో ఉంది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేరే హీరోయిన్స్ వలన తనకు ఆఫర్స్ తగ్గలేదని పేర్కొంది.
కొత్త హీరోయిన్స్ రావడం వలన పాతవారికి ఆఫర్స్ తగ్గుతాయని నేను విశ్వసించను. పాత్రకు ఎవరు సరిగ్గా సెట్ అవుతారో మేకర్స్ వారినే ఎంచుకుంటారు. ఒకరి ఆఫర్స్ మరొకరు లాక్కునే అవకాశం ఉండదు. వేరే వారి పాత్రను నేను చేస్తే బాగుండేది అని ఎప్పుడు అనుకోను. వచ్చిన ఆఫర్స్కి పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను అని అంజలి పేర్కొంది.