యువతి వివాహానికి చేయూత

గోదావరిఖని: పేదింటి యువతి పెళ్లికి సాయం అం దించి పెద్ద మనసు చాటుకున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం 2వ డివిజన్‌కు చెందిన తాటికొండ దివ్య వివాహం ఈనెల 18వ తేదీన నిశ్చయం కాగా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న విషయం తెలుసుకొని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తె, మట్టెలను దివ్యకు అందజేశారు. కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, ప్రసన్నకుమార్ తదితరులున్నారు
‘కోరుకంటి’పై కేసు కొట్టివేత
2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి పోలీసులు రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్‌పై నమోదు చేసిన కేసును గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు మెట్రో పాలిటన్ కేసును కొట్టివేసింది. నాలుగు నెలలుగా నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా తప్పుడు కేసుగా నిర్ధారణ కావడంతో కేసును కొట్టివేసినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. తనను, ముత్యం సంతోష్‌ను కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందన్నారు.