నాణ్యతతో కూడిన బొగ్గును వెలికితీయాలి

రామగిరి: నాణ్యతతో కూడిన బొగ్గును వెలికితీయాలని మైనింగ్ అడ్వైజర్ డీఎన్ ప్రసాద్ సూచించారు. రామగుండం-3 డివిజన్‌ను మైనింగ్ అడ్వైజర్ డీఎన్ ప్రసాద్, ప్రాజెక్టు ప్లానింగ్ జీఎం సత్తయ్య గురువారం సందర్శించారు. ఈ మేరకు ఓసీపీ-2, ఓసీపీ-2 ప్రాజెక్టును సందర్శించిన వారు పవర్ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓసీపీల్లో జరుగుతున్న అభివృద్ధి, ఉత్పత్తి, రక్షణ విషయంలో తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికల గురించి ఆర్జీ-3 జీఎం కే సూర్యనారాయణ వివరించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్జీ-1, 2, 3 ఏరియాల జీఎంలు కే నారాయణ, ఎం సురేశ్, కే సూర్యనారాయణ, ఇతర అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓపెన్ కాస్టు గనుల అభివృద్ధి, భూసేకరణ, వాటి పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఓసీపీ-1, 2, 3 పీవోలు శ్రీనివాసరావు, ఎం నరేందర్, నర్సింహారావు, సర్వే ఆఫీసర్ కే రమేశ్‌తోపాటు అధికారులున్నారు.
మేడిపల్లి ఓసీపీ సందర్శన
గోదావరిఖని: ఆర్జీ-1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీని మైనింగ్ అడ్వైజర్ డీఎన్ ప్రసాద్ సందర్శించారు. ఈ మేరకు ఓసీపీలో జరుగుతున్న ఓబీ తరలింపు పనులతోపాటు బొగ్గు ఉత్పత్తి తదితర విషయాల గురించి ఆర్జీ-1 జీఎం కే నారాయణను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు తరలింపు సమయంలో రక్షణ చర్యలను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్జీ-1 జీఎంతోపాటు మేనేజర్ గోవిందరావు, సర్వే అధికారి అలీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డితోపాటు ఇతర అధికారులు ఉన్నారు.
ఓసీపీ-3లో..
యైటింక్లయిన్ కాలనీ: రామగుండం రీజియన్-2 ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో గురువారం కోల్ అడ్వైజర్ డీఎన్ ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా ఏరియా జీఎం ఎం సురేశ్‌తో కలిసి ప్రాజెక్టులో బొగ్గు, ఓబీ ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ఆయనవెంట ప్రాజెక్టు ఆఫీసర్ ఎంవీ నర్సింహారావు, సర్వేయర్ నర్సింగరావు ఉన్నారు.
తాజావార్తలు
- భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉంది : హోంమంత్రి
- ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
- నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- వన్‌ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా