సోమవారం 18 జనవరి 2021
Peddapalli - Dec 06, 2020 , 01:54:02

కేంద్ర బిల్లులను రద్దు చేయాలి

కేంద్ర బిల్లులను రద్దు చేయాలి

  • రైతులపై లాఠీచార్జీ సరికాదు
  • సీపీఐ, సీఐటీయూ నాయకులు

గోదావరిఖని:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-11వ గనిపై శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జీ చేయించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, మెండె శ్రీనివాస్‌, ఆరెపల్లి రాజమౌళి, అన్నం శ్రీనివాస్‌, గజేంద్ర, సతీశ్‌కుమార్‌, దేవేందర్‌, రామన్న తదితరులున్నారు. 

ఓదెల: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకురావడం, రైతులపై లాఠీచార్జీని నిరసిస్తూ ఓదెల తహసీల్‌ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కరంట్‌ మోటర్లకు మీటర్లను అమర్చవద్దని కోరారు. కార్యక్రమంలో నాయకులు సదానందం, స్వామి తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి టౌన్‌: సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నాయకులు మ ద్దెల దినేశ్‌, ఆరెపల్లి మానస కుమార్‌, రమేశ్‌, మహేందర్‌, సురేశ్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

బంద్‌ను విజయవంతం చేయండి

రామగిరి: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత్‌ బం ద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ కార్యదర్శి వెంకన్న కోరారు. ఈ మేరకు శనివారం సెంటినరీకాలనీలో బంద్‌ను విజయవంతం చేయాలని వ్యాపారులను కలిసి పేర్కొన్నారు. బీజేపీ ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక సమ్మె స్ఫూర్తితో రైతులకు మద్దతు పలుకాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అశోక్‌, మోహన్‌, మనోజ్‌, సత్తి, గట్టు మురళి ఉన్నారు.