బుధవారం 27 జనవరి 2021
Peddapalli - Dec 06, 2020 , 01:54:00

నట్టల నివారణ మందు వేయించాలి

నట్టల నివారణ మందు వేయించాలి

ఓదెల: గొర్రెలు, మేకలకు తప్పని సరిగా నట్టల నివారణ మందులను వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి నారాయణ సూచించారు. మడక లో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని జేడీఏ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 6.45 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయని వెల్లడించారు. నట్టల నివారణ మందలు వేయడంతో జీవాల్లో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆశించిన ఎదుగుదల వస్తుందని వివరించారు. నాణ్యమైన మాం సం కూడా ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ నెల 7వ తేదీ వరకు నట్టల నివారణ మందులు వేస్తారన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారి మండలానికి వచ్చిన నారాయణను ఎంపీపీ కునారపు రేణుకాదేవి, నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి కుమారస్వామి, స ర్పంచ్‌ మ్యాడగోని భాగ్యమ్మ, ఎంపీటీసీ నోముల పద్మావతి, వైస్‌ ఎంపీపీ పల్లె కుమార్‌, నాయకులు మ్యాడగోని శ్రీకాంత్‌, గోర్ల కుమార్‌, నోముల మహేందర్‌రెడ్డి, సమ్మయ్య, మల్లయ్య, కుమార్‌, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.   

ఎలిగేడు: ఎలిగేడు, లాలపల్లిలో మండల పశువైద్యాధికారి ఝాన్సీ ఆధ్వర్యంలో 3,500 గొర్రెలు, 200 మేకలకు నట్టల నివారణ మందు లు వేశారు. కార్యక్రమాల్లో ఎలిగేడు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ బూర్ల సింధూజ, కోరుకంటి వెంకటేశ్వరరావు, సమ్మయ్య(వెటర్నరీ సహాయకుడు), సింగిరెడ్డి ఎల్లవ్వ-రాజేశ్వరరెడ్డి, సూరమ్మ పాల్గొన్నారు.

జూలపల్లి : తేలుకుంటలో సర్పంచ్‌ సొల్లు పద్మ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేకలు, గొర్రెలకు శనివారం నట్టల నివారణ మందులు వేశారు. ఇక్కడ 1532 గొర్రెలు, 142 మేకలకు నివారణ మందులు వేయించినట్లు వైద్యాధి కారి కోటేశ్వర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కత్తెర్ల శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ చొప్పరి నర్సింగం, సొల్లు శ్యామ్‌, సిబ్బంది హైమత్‌పాషా, శంకర్‌, కల్లెపెల్లి రవి, మంద మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌రూరల్‌: కాట్నపల్లి, ఐతరాజ్‌పల్లి, మియాపూర్‌ గ్రామాల్లో పశువైద్యాధికారి రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను ఆయా గ్రామాల సర్పంచులు పంపిణీ చేశారు. దాదాపు 6550 గొర్రెలు, మేకలకు మందులను వేసినట్లు పశువైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి నారాయణ, సర్పంచులు మోరపల్లి మోహన్‌రెడ్డి, గుజ్జేటి దేవమ్మ, స్వప్న, ఎంపీటీసీలు, పశువైద్య సిబ్బంది, కాపరులు తదితరులు ఉన్నారు. 

కాల్వశ్రీరాంపూర్‌ : వెన్నంపల్లిలో 2,835, అంకంపల్లిలో 2,420 గొర్రెలు, మేకలకు ఎంపీపీ నూనేటి సంపత్‌ శుక్రవారం నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఆకుల చిరంజీవి, కాసం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ జెట్టి దేవన్న, పశువైద్యాధికారి సురేశ్‌, పశు వైద్య సిబ్బంది అబ్దుల్‌పాషా, ఖాజాపాషా, గోపాలమిత్రలు తదితరులున్నారు. 

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం కొత్తపల్లి, పెద్దబొంకూర్‌లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసినట్లు రాగినేడు పశువైద్యాధికారి కమలాకర్‌ తెలిపారు. పెద్దబొంకూర్‌లో1295 గొర్రెలు, 214 మేకలకు, కొత్తపల్లిలో 1347 గొర్రెలు, 58 మేకలకు మందులు వేశామన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక గొర్రెల, మేకల సహకార సంఘం అధ్యక్షుడు చేగొండ రవికుమార్‌ యాదవ్‌, సర్పంచ్‌ సిలారపు సత్యం యాదవ్‌, సంపత్‌కుమార్‌ తదితరులున్నారు.logo