సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

- పెద్దపల్లి డీసీపీ రవీందర్
- చిన్నరాత్పల్లిలో పోలీసుల కార్డన్‌సెర్చ్
కాల్వశ్రీరాంపూర్ : ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్ సూచించారు. మండలంలోని చిన్నరాత్పల్లిలో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటా సోదాలు చేశారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాల నియంత్రణ కోసమే గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వినియోగంపై వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్, సర్పంచ్ దాసరి నవలోక, టీఆర్ఎస్ నాయకులు దాసరి నరేందర్, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.
వాహనాల తనిఖీ
పెద్దపల్లి టౌన్: పెద్దపల్లి శాంతినగర్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. రామగుండం సీపీ, డీసీపీ ఆదేశాల మేరకు మంథనికి వెళ్లే రహదారిపై వాహనాలను తనిఖీ చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ తెలిపారు. అలాగే పెండింగ్ చలాన్లను త్వరితగతిన చెల్లించేలా పలువురికి సూచనలు చేశామని వివరించారు.
రాంగ్ రూట్లో నడిపితే కఠిన చర్యలు
సుల్తానాబాద్‌రూరల్: వాహనాలను రాంగ్రూట్లో నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గట్ల మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. కాట్నపల్లి రాజీవ్ రహదారిపై వాహనాల తనిఖీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టి, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. అనంతరం సీఐ మా ట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు ఉపేందర్‌రావు, లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, చంద్రకుమార్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
పోలీసుల కూంబింగ్
మంథని రూరల్: అడవిసోమన్‌పల్లి, గోపాల్పూర్, చిన్న ఓదాల గ్రామాల్లోని అటవీ ప్రాం తాల్లో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూం బింగ్ నిర్వహించారు. ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో మంథని మండలంలోని మానేరు నది వెంట తనిఖీలు చేశారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. ఇక్కడ ఎస్ఐ జాన్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- క్యాపిటల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి
- ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’
- చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
- రిపబ్లిక్ డే గిఫ్ట్‌గా అక్షయ్ 'బచ్చన్ పాండే'
- వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్
- కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి