పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

జూలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు బుధవారం వారిద్దరు కలిసి తొలి విడుత నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భం గా జడ్పీటీసీ మాట్లాడుతూ, ప్రభుత్వం పశు సంపదను కాపాడుకునేందుకు ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నదన్నారు. జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చా రు. ఇక్కడ సర్పంచ్ దారబోయిన నరసింహం, ఉప సర్పంచ్ కొప్పుల మహేశ్, ఇన్చార్జి మండల పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీప్రియ, సిబ్బంది హైమత్‌పాషా, కల్లెపెల్లి రవి, మంద మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు: ముప్పిరితోటలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మం దులు వేశారు. ఇక్కడ సర్పంచ్ పెద్దోల్ల అయిలయ్య, వైద్యురాలు ఝాన్సీ, ఉప సర్పంచ్ చీకటి శైలజ, ఎంపీటీసీ నారగోని ఎల్లమ్మ, ఎలిగేడు మాజీ సర్పంచ్ మండిగ రాజనర్సయ్య ఉన్నారు.
ఓదెల : పొత్కపల్లిలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. ఇక్కడ సర్పంచ్ ఆల్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్, రెడ్డి శ్రీనివాస్, మండల పశు సంవర్ధకశాఖ అధికారి కుమారస్వామి తదితరులున్నారు.
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం భోజన్నపేట, చీకురాయిల్లో గొర్రెలు, మేకలకు నట్ట నివారణ మందులు వేసే కార్యక్రమాన్ని జడ్పీటీసీ బండారి రామ్మూర్తి ప్రారంభించారు. భోజన్నపేటలో 2,578 గొర్రెలు, 236 మేకలు, చీకురాయిలో 437 గొర్రెలు, 65 మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమంలో సర్పంచులు మేకల మల్లేశం యాదవ్, బండారి త్రివేణి, రాగినేడు పశువైద్యాధికారి కమలాకర్, గోపాల మిత్రలు తదితరులున్నారు.
ముత్తారం: కేశనపల్లి, హరిపురంల్లో గొర్రెలు, మేకలకు వైద్యుడు హన్నన్ నట్టల నివారణ మం దు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నూనె కుమార్‌యాదవ్, ఉప సర్పంచ్ తాత స్వప్న బాలు, ఎంపీటీసీలు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మారం: కటికెనపల్లిలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ కరుణశ్రీ ప్రారంభించారు. కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, సర్పంచ్ కారుపాకల రాజయ్య, ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రామడుగు గంగారెడ్డి, వార్డు సభ్యులు, నంది మేడారం వీఎల్వో పంపరి శంకర్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కొత్తూరులో సర్పం చ్ తాళ్ల మల్లేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు రాజేశ్వరి, జీపీ కార్యదర్శి రమేశ్, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు పొట్టాల హన్మంతు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్: కనుకుల, రామునిపల్లి, బొంతకుంటపల్లి, నర్సయ్యపల్లి గ్రామాల్లో గొర్రె లు, మేకలకు ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో మందులు వేశారని పశువైద్యాధికారి రఘుపతిరెడ్డి తెలిపారు. మొత్తం 4400 మూగ జీవాలకు మందులను పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమాల్లో సర్పంచులు పోలు అంజయ్య, మల్యాల శ్రీనివాస్, అనిత తిరుపతి, లావణ్య వెంకట్, నాయకులు సత్యనారాయణ, నారాయణ తదితరులున్నారు.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి