ఓటీపీతో రేషన్

- వృద్ధులు, ఇతరులకు తొలగనున్న రేషన్ ఇక్కట్లు
- ప్రారంభమైన సరికొత్త విధానం
- అక్రమ రవాణాకు ఇక చెక్
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం మరో అడుగు ముందుకేసింది. రేషన్ బి య్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టనుంది. రేషన్ దు కాణాల్లో వృద్ధులు, ఇతరులు ఇబ్బందులు పడకుండా సరుకులు పొందేందుకు సులువైన పద్ధతిని తీసుకొచ్చింది. వేలిముద్రలు, ఐరిస్‌తో పనిలేకుండా కేవలం ఒక్క ఓటీపీతోనే రేషన్ బియ్యం పొందేలా రూపొందించింది. ఇప్పటికే బోగస్ రే షన్ కార్డులను ఏరివేసేందుకు బయోమెట్రిక్, ఐ రిస్ విధానాన్ని అమలు పర్చడంతో ప్రతి నెలా కొ న్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతున్నది. సరైన లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందాలనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిగ్గా లేని లబ్ధిదారులకు, ఐరిస్ రాని వారి కోసం స్థానిక వీఆర్ఓలు ధ్రువీకరించిన తర్వాతే వీరికి రేషన్ బియ్యం సరఫరా చేసింది. ఇందుకోసం వృద్ధులు, ఇతర లబ్ధిదారులు పడిగాపులు పడాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ విధానానికి చెక్ పెట్టి ఓటీపీ ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల నుంచే రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చే స్తున్నది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో రెండు నెలల నుంచి ఓటీపీతో రేషన్ బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు. రేషన్ లబ్ధిదారులు ఆయా రేషన్ దు కాణంలో సరుకులు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేయగా నే ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీని ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించనున్నారు.
అక్రమాలకు చెక్
పేద ప్రజలకు పకడ్బందీగా రేషన్ బియ్యం పంపిణీ చేసేలా అనేక చర్యలు చేపట్టినా అక్రమార్కులు రేషన్ దందాను వదలడం లేదు. ఏదో ఒక విధంగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నా రు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాలు మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలుగా ఉండడంతో అధికారుల కళ్లుగప్పి గంటల వ్యవధిలో రాత్రికి రాత్రే త్రిసరిహద్దులు దాటిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వేలిముద్రలు, ఐరిస్ రాని వృద్ధులకు ఓటీపీ ద్వారా రేషన్ అందించనున్నారు.
ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలి
రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ తమ రేషన్, ఆధార్ కార్డులకు తన మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి. వేలిముద్రలు, ఐరిస్ పడకుండా ఇబ్బందులు పడుతూ థర్డ్ పార్టీ ద్వారా రేషన్ పొందుతున్న లబ్ధిదారులు ఇకపై ఓటీపీతో సరుకులను తీసుకోవచ్చు. గతంలో బయోమెట్రిక్, ఐరిస్ రాని వారికి వీఆర్ఏ, వీఆర్ఓల ద్వారా రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేసేవారు. వచ్చే నెల నుంచి వేలిముద్రలు సరిగా లేని వారికి ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ సరుకులను అందించనున్నది. ఓటీపీ ద్వారా రేషన్ పొందే వారు ఆధార్‌కు మొబైల్ నెంబర్‌ను వెంటనే లింక్ చేసుకోవాలి.
-తోట వెంకటేశ్, పెద్దపల్లి డీఎస్వో
తాజావార్తలు
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి