గురువారం 28 జనవరి 2021
Peddapalli - Dec 01, 2020 , 03:09:29

13న రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు

13న రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు

గోదావరిఖని: రామగుండం నియోజకవర్గం పరిధి గోదావరిఖని నగర శివారులోని గోదావరి నది వద్ద రెండోసారి రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలకు ఈ నెల 13వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్‌ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండలా మారిన గోదావరి నదిలో గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే పీవీ జయంత్యుత్సవాల్లో భాగంగా తారా ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే భారతీయ సాంస్కృతిక కళల ఉత్సవాల్లో మంత్రిని ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. ఇక్కడ నాయులు తదితరులు ఉన్నారు.


logo