బుధవారం 20 జనవరి 2021
Peddapalli - Nov 30, 2020 , 02:27:11

మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

గోదావరిఖని: కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కార్మికుల చేతిలో గుణపాఠం తప్పదని ఐఎఫ్‌టీయూ రీజియన్‌ అధ్యక్షుడు మల్యాల దుర్గయ్య విమర్శించారు. ఆర్జీ-1 ఏరియా సమావేశాన్ని ఆ యూనియన్‌ కార్యాలయంలో ఆదివా రం నిర్వహించగా, ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పారిశ్రామిక వేత్తలకు అమ్మకానికి పెట్టేందుకు మోడీ ప్రభుత్వం యత్నిస్తున్నదని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా తీసుకవస్తూ చివరకు కార్మిక సం ఘాలు లేకుండా దుర్మార్గంగా చట్టాలు తీసుకువస్తుందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా పని చేస్తున్న 26 ట్రేడ్‌ యూనియన్లు, ఎల్‌ఐసీ, బ్యాంకింగ్‌, కార్మిక, ఉపాధ్యాయ శ్రామిక వర్గం కొన్నేళ్లుగా ఐక్య ఉద్యమంతో ముందుకుసాగుతున్నదని తెలిపారు. భవిష్యత్‌లో జరిగే పోరాటాలకు కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం నాయకులు  కృష్ణ, నరేశ్‌, మల్లేశం, తోకల రమేశ్‌, సాంబయ్య, మొండయ్య, ఎల్‌.ప్రసాద్‌, సాంబయ్య, సంపత్‌, శ్రీధర్‌ తదితరులున్నారు. 


logo