ఆదివారం 24 జనవరి 2021
Peddapalli - Nov 30, 2020 , 02:15:00

పేద రైతులకు లయన్స్‌ క్లబ్‌ చేయూత

పేద రైతులకు లయన్స్‌ క్లబ్‌ చేయూత

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో ఇద్దరు పేద రైతులకు లయన్స్‌క్లబ్‌ ఎలైట్‌ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఆదివారం చేయూతనందించి రూ. 10 వేల విలువైన స్ప్రేయర్లు, టార్పాలిన్‌ కవర్లు అందజేశారు. వీటిని పెద్దపల్లి జోనల్‌ చైర్‌పర్సన్‌ జైపాల్‌ రెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. డిస్ట్రిక్ట్‌ 320జీ అలాయి బలాయి కార్యక్రమంలో భాగంగా  రైతులకు ఉచితంగా సామగ్రి అందజేశామని లయన్స్‌ క్లబ్‌ ఎలైట్‌ పెద్దపల్లి అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొమ్ము శ్రీనివాస్‌, లయన్స్‌క్లబ్‌ ఎలైట్‌ పెద్దపల్లి కోశాధికారి సంపత్‌రావు, సంయుక్త కార్యదర్శి అనిల్‌, సహాయ కార్యదర్శి శ్రీధర్‌, సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలు చేపట్టాలి 

సుల్తానాబాద్‌: లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శాశ్వత సేవా కార్యక్రమాలను చేపట్టాలని డిస్ట్రిక్ట్‌ 320 జీ గవర్నర్‌ గుర్రం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సుల్తానాబాద్‌ పట్టణంలో లయన్స్‌ క్లబ్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్‌ రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు మాటేటి శ్రీనివాస్‌, కార్యదర్శి మూల మహేందర్‌రెడ్డి, డీసీటీ సుదర్శన్‌రెడ్డి, ఆర్‌సీ శేగంటి నరేశ్‌, జీఎంటీ కో-ఆర్డినేటర్‌ హనుమాండ్ల రాజిరెడ్డి, సీక్యూఐ సింహరాజు కోదండరాములు, అడిషనల్‌ సెక్రటరీలు మోర భద్రేశం, నడిపెల్లి వెంకటేశ్వర్‌రావు, జయప్రకాశ్‌చావ్డ, జిల్లా కో-ఆర్డినేటర్లు వల్స నీలయ్య, జూలూరి అశోక్‌, బూరుగు రాజేశం, గజభీంకార్‌ జగన్‌, కొమురవెల్లి చక్రధర్‌, దీకొండ భూమేశ్‌, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


logo