‘గ్రేటర్'లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

- జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని టౌన్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. నేరెడ్మెట్ 136వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి తరఫున పుట్ట మధూకర్ ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని అన్ని వార్డుల్లో మంథనితో పాటు కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల యూత్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై కళాకారుల ఆట పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. మహాబోధి ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీలతో జడ్పీ చైర్మన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నేరెడ్మెట్ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పుట్ట మధూకర్ అడిగి తెలుసుకోవడంతో పాటు వార్డులో చేపట్టనున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.
ధర్మారం: మంత్రి కొప్పుల ఈశ్వర్ 135వ డివిజన్‌కు ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా, ఆయన పిలుపు మేరకు పార్టీ ముఖ్య నాయకులు తరలి వెళ్లి అభ్యర్థి సబితా కిశోర్ పక్షాన ఇంటింటా ప్రచారం చేశారు ప్రచారంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, కటికెపల్లి సర్పంచ్ కారుపాకల రాజయ్య, నంది మేడారం, కటికెనపల్లి, దొంగతుర్తి ఎంపీటీసీ సభ్యులు మిట్ట తిరుపతి, సూరమల్ల శ్రీనివాస్, దాడి సదయ్య, ఆర్బీఎస్ బాధ్యులు పాకాల రాజయ్య, పూస్కూ రు రామారావు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పాక వెంకటేశం, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, నంది మేడారం ప్యాక్స్ వైస్ చైర్మన్ సా మంతుల రాజమల్లు, నాయకులు మూల మల్లేశం, రాచూరి శ్రీధర్,బండి సురేశ్, బాస తిరుపతి రావు, కట్ట స్వామి, చింతల జగన్మోహన్ రెడ్డి, దొనికెని తిరుపతి గౌడ్, మోతె కనకయ్య, చొప్పరి చంద్రయ్య, ఆవుల ఎల్లయ్య, బొజ్జ మహిపాల్, దేవి నళినీకాంత్, అజ్మీరా మల్లేశం, బాలసాని తిరుపతి, కనమండ రమేశ్ ,కాంపెల్లి రాజయ్య, అలువాల సంతోష్, శ్రావణ్ పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌రూరల్: మల్కాజిగిరి 139వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, నాయకులు ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
పెద్దపల్లిరూరల్: టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యెడ సతీశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు మర్కులక్ష్మన్, మాజీ ఎంపీటీసీ మాదా సి రవీందర్, అర్కుటి రామస్వామి యాదవ్, పెద్దపల్లి 1 వార్డు కౌన్సిలర్ వీరబోయిన శ్రీనివాస్ 139వ డివిజన్లో ప్రచారం చేశారు. అభ్యర్థి ప్రేమ్‌కుమార్ గెలుపుకోసం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రచారం చేశారు.
ఎలిగేడు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలిగేడు నుంచి టీఆర్ఎస్ నాయకులు, సింగిల్‌విండో చైర్మన్ గోపు విజయభాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్ ప్రభుత్వ విప్ తానిపర్తి భానుప్రసాదరావుతో కలిసి 92వ డివిజన్లో ప్రచారం చేశారు. ప్రచారంలో గుడుగుల మహేందర్, శాంతిరెడ్డి, అనిల్‌గౌడ్, తిరుపతిగౌడ్, తాటిపల్లి సతీశ్‌బాబు, చలందుల చంద్రశేఖర్ యాదవ్, బంగ్ల శ్రీనివాస్, పోచాలు తదితరులున్నారు. అలాగే 135వ డివిజన్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండాల్‌రెడ్డి, మండిగ రాజనర్సయ్య తదితరులున్నారు.
గోదావరిఖని: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో రామగుండం నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే మహా నగరాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన 137వ డివిజన్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. నియోజక వర్గం నుంచి 300 మంది టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నగర మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అలాగే 37వ డివిజన్ కుర్మగూడలో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నవిత యాదవ్ తరఫున స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ విజయారెడ్డి ఇక్కడి పార్టీ మహిళలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..
- గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నేడే చివరి తేదీ
- బైడెన్ ప్రమాణం.. ఎంత మంది హాజరవుతున్నారో తెలుసా ?
- తెలంగాణలో కొత్తగా 267 పాజిటివ్ కేసులు
- వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన ఆస్ట్రేలియన్ మీడియా
- పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'
- జల్పాయ్గురి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- బిలియనీర్ జాక్‌మా కనిపించారు..
- కప్పేసిన పొగమంచు.. పలు రైళ్లు ఆలస్యం