లక్ష్యం మేరకు పనులు చేయాలి

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి జంక్షన్: జిల్లాలో లక్ష్యం మేరకు రైతు కల్లాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు కల్లాల నిర్మాణం, ధాన్యం కొనుగోలుకు సం బంధించిన అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వరి సాగు అధికంగా అవుతుందని, ప్రభుత్వం రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు రూ. 16 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటి దాకా రైతుల నుంచి లక్ష్యం మేరకు దరఖాస్తులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఈవోలు.. ఆర్బీఎస్ సభ్యులతో సమన్వ యం చేసుకుంటూ రెండు రోజుల్లో లక్ష్యాల మేరకు కల్లాలు మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 50వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, డీఆర్డీవో వినోద్, పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక