హరిత వనాలుగా తీర్చిదిద్దాలి

- ఇన్చార్జి కలెక్టర్ భారతీ హోళికేరి
- అభివృద్ధి పనులపై సమీక్ష
పెద్దపల్లి, నమస్తే తెలంగాణ: ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని ఇన్చార్జి కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. జిల్లాలో పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతోపాటు పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ప్రతి గ్రామంలో నర్సరీ, డంప్ యార్డు, ట్రాక్టర్ ట్యాంకర్, వైకుంఠధా మం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్ల పనులను సకాలంలో పూర్తి చేయాలని, జిల్లాలో 263 వైకుంఠధామ నిర్మాణ పనులను డిసెంబరు 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 54 రైతు వేదికలకుగాను ఇప్పటి దాకా 49 పూర్తి చేశామని, మిగతా కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సకాలంలో వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 263 కంపోస్టు షెడ్లను 6.62 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టామని, వీటిని డిసెంబరు 7వ తేదీలోగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం రూ.11.47 కోట్లతో 1428 కల్లాల నిర్మాణ పను లు మంజూరు చేశామని, వీటిని డిసెంబరు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని, హరిత ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండల పరిధిలో అధికారి సమన్వయం చేసుకుంటూ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్, పార్కు, ప్రభుత్వం సంస్థల ప్రాంగణాల్లో నాటే మొక్కల సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వైకుంఠ ధామాలు, కంపో స్టు షెడ్లకు గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనానికి ప్రతీకలు
పాలకుర్తి: పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో పచ్చదనానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఇన్చార్జి కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. భామ్లనాయక్ తండా పరిధిలోని రాజీవ్తండాలోని పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డు, వైకుంఠధామం నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలని ఎంపీడీవో శివాజీని ఆదేశించారు. భామ్లనాయక్తండా గ్రామపంచాయతీ పరిధిలోని రెం డు గ్రామాల్లో రెండు ప్రకృతి వనాలు నిర్మించాలని సర్పంచ్ బదావత్ రాజునాయక్‌కు సూచించారు. మండలంలోనే మొదటగా సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం పూర్తిచేసి, తడి చెత్త, పొడిచెత్త, ప్లాస్టిక్ వస్తువులు వేరు వేరుగా వేస్తున్నందుకు సర్పంచ్‌ను అభినందించారు. గ్రామంలో నిరుద్యోగ యువత ఉపాధికోసం ప్రభుత్వ స్థలంలో మార్కెటింగ్ గోదాంలు నిర్మించాలని, స్థానిక భూమి అందుబాటులో ఉందని సర్పంచ్ ఇన్చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట ఉప సర్పంచ్ జ్యోతిశంకర్, వార్డు సభ్యుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
పెద్దపల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని రాఘవాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రం, అలాగే రైతు వేదికను పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై అధికారులు, మహిళా సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు కూడా కొనుగోలు కేంద్రానికి తాలు, తప్పలేని ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ప్రతి గ్రామంలో రోజూ పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఇస్మాయిల్, పెద్దపల్లి ఈజీఎస్ ఏపీడీ, ఎంపీడీవో రాజు, ఎంపీవో సుదర్శన్, ఐకేపీ సెంటర్ ఇన్చార్జి హరిబాబు, నిర్వాహకులు కొడపాక సంధ్య, పుల్లూరి తిరుమల తదితరులున్నారు.
తాజావార్తలు
- మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఆహా..
- పక్షులకు గింజలు వేసిన ధావన్..విచారణకు డీఎం ఆదేశం
- వేధింపులపై నటి నేహా శర్మ ఫిర్యాదు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్‌డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు