శనివారం 16 జనవరి 2021
Peddapalli - Nov 28, 2020 , 02:07:24

చిరు జల్లులు.. చలి గాలులు

చిరు జల్లులు.. చలి గాలులు

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నిలిచిన కొనుగోళ్లు

ఓదెల: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జనజీవనం ఆగమవుతున్నది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌తో శుక్రవారం చిరుజల్లులు కురవడంతో పాటు చలి గాలులు వీచి ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ ప్రభావంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే ధాన్యం కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పలపై పరదాలు, టార్పాలిన్‌ కవర్లు కప్పి వడ్లు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే రెండు రోజుల నుంచి వ్యవసాయ అధికారుల సూచనలతో వరి కోతలు కూడా నిలిచిపోయాయి. చలి ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటికి వెళ్లని పరిస్థితి నెలకొంది. 

మంథని టౌన్‌: పట్టణంలోని పవర్‌హౌస్‌కాలనీ, పోచమ్మవాడ, గంగాపురి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యం తడువకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. టార్ఫాలిన్లు కవర్లు కప్పడంతో పాటు ఎండ వచ్చే సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టారు. పంటలు చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ ప్రభావం చూపుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.