సోమవారం 18 జనవరి 2021
Peddapalli - Nov 27, 2020 , 00:53:56

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

  • బాధ్యలపై ప్రచారం చేయాలి
  • కలెక్టరేట్‌లో సంవిధాన్‌ దివస్‌లో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ 

పెద్దపల్లి జంక్షన్‌: జిల్లావ్యాప్తంగా రాజ్యాంగ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అంబేద్కర్‌ చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు  రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక బాధ్యతలపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.  కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో జీఎం కే నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకలకు డైరెక్టర్‌ (ఆపరేషన్‌) చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జీఎం సేఫ్టీ టీవీ రావు, క్వాలిటీ జీఎం సురేందర్‌, సీఎంవోఐఏ అధ్యక్షుడు మనోహర్‌, ఎస్‌వోటూ జీఎం త్యాగరాజు, ఏరియా సేఫ్టీ అధికారి కేవీ రావు, ఏజీఎం, డీజీఎంలు రామకృష్ణ, ఆంజనేయులు, కాశీ విశ్వేశ్వర్‌, మురళీధర్‌, హరినాథ్‌, పీఎం రమేశ్‌, చక్రవర్తి ఇతర అధికారులున్నారు. 

రామగిరి:  ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ-3 జీఎం కే సూర్యనారాయణ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, సీఎంవోఏఐ ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఏఎస్‌వో జయరాజ్‌, డీజీఎం సివిల్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ నాగేశ్వరరావు, డీజీఎం సుధాకర్‌ తదితరులున్నారు. రామగిరి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీ సీఈవో మచ్చ గీత, జడ్పీటీసీతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచులు బుర్ర పద్మ, పల్లె ప్రతిమ, గాజుల ప్రశాంతి, గంట పద్మ,  పద్మ, రామగిరి లావణ్య, దేవునూరి రజిత పాల్గొన్నారు.

మంథని టౌన్‌: మంథని కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నాగేశ్వర్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో  హరిబాబు, రమణ కుమార్‌ రెడ్డి,  రఘోత్తంరెడ్డి, రమేశ్‌బాబు,  ఆంజనేయులు, నాగరాజు, సుభాష్‌, సతీశ్‌ ఉన్నారు.  

పెద్దపల్లి జంక్షన్‌: టీఎన్జీవో సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహానికి టీఎన్జీవో నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్‌ మాట్లాడారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాజనరేందర్‌,  శ్రీనివాస్‌, దేవేందర్‌, సత్యనారాయణ, సందీప్‌, సంపత్‌, సత్యం, రవీందర్‌, స్వాతి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి: తహసీల్‌ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జాతీయ నేతలకు నివాళులర్పించారు.

కోల్‌సిటీ: దళిత పరివర్తన సేన ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటనికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగ రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అంటూ యువకులు ప్రతిజ్ఞ చేశారు. దళిత పరివర్తన్‌ సేన అధ్యక్షుడు ఈదునూరి శంకర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కండె రాజశేఖర్‌, రాయమల్లు,  కీర్తిశేఖర్‌, తిరుపతి, ప్రణీత్‌, నంది సతీశ్‌, మహేందర్‌ ఉన్నారు.

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ యాజమాన్యం ఈడీసీ మిలీనియం హాల్‌లో చేపట్టిన కార్యక్రమానికి సీజీఎం సునీల్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీజీఎం రాజ్యాంగం పరిరక్షణ హామీ ప్రతిజ్ఞ, రాజ్యాంగ ఆమోదిత సందేశాన్ని చదివి వినిపించారు. అంతకుముందు  ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌, ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ నాయకులు ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ జీఎంలు సమాయర్‌, పీకే లాడ్‌, ఏజీఎం హెచ్‌ఆర్‌ విజయలక్ష్మీ మురళీధరన్‌, ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శి సోమ్ల్లా భూక్యా, ప్రేమ్‌రెడ్డి, పీఆర్వో సహాదేవ్‌ శేథి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు దశరథ్‌, ఆరెపల్లి లక్ష్మీనారాయణ, ఆరెపల్లి రాజేశ్వర్‌, బండారి కనకయ్య, అంజయ్య, వెంకటస్వామి, రవికుమార్‌ న్నారు. 

ధర్మారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మోడల్‌ పాఠశాల, సాయంపేటలోని ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాళ్లు ఆత్రం శశికిరణ్‌, మన్నె దీన, హెచ్‌ఎం జాడి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా బీఆర్‌ అంబేద్కర్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ధర్మారంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌ సంఘం, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో విగ్రహానికి నాయకులు పూల మాలలు వేశారు. కార్యక్రమంలో  కాం పెల్లి చంద్ర శేఖర్‌, బొల్లి స్వామి, బొడ్డు రాములు,   సుంచు మల్లేశం, బొల్లి రాజశేఖర్‌, బొల్లి రాజయ్య, కాడె సూర్యనారాయణ, కాంపెల్లి పోచయ్య, బోరకుంట మల్లయ్య, నార ప్రేమ్‌ సాగర్‌ పాల్గొన్నారు.

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి తహసీల్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు సిబ్బందితో తహసీల్దార్‌ దుర్శెట్టి శ్రీనివాస్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధికా రులు రాంబాబు, భవానీప్రసాద్‌, వరలక్ష్మి,  సాహిత్య,  సుకుమార్‌, భవాని, అశ్విని, ధరణి ఆపరేటర్‌ వేణు కుమార్‌ తదితరులున్నారు. 

పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహానికి దళితశక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షుడు మాడుగుల సదానందం ఆధ్వర్యంలో పూలమాలల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాటూరి దుర్గయ్య, బొంకూరి రమేశ్‌, అడకపురం చంద్రమౌళి, రేగుల వీరస్వామి, రాజేంద్రప్రసాద్‌, పుల్లూరి శేఖర్‌, బొంకూరి ప్రవీణ్‌ కుమార్‌, గుడిసెల సతీశ్‌, కండె రవీందర్‌, ఆవునూరి సతీశ్‌, శనిగారం క్రిష్ణ, బూడిద మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

జూలపల్లి : మండల కేంద్రంలోని పాత బస్టాండు ప్రాంతంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాలలు వేశారు. ఇక్కడ సర్పంచ్‌ దారబోయిన నరసింహం, మానుమండ్ల శ్రీనివాస్‌, చీదురు శ్రీనివాస్‌, పాటకుల భూమయ్య, మాం కాలి అంజయ్య, అమరగాని సాయి, మామిడిపెల్లి కాంతయ్య, కంకణాల జ్యోతిబసు, కల్లెపెల్లి నరేశ్‌, అజేయ్‌, అంజయ్య, శ్రీనివాస్‌, చంద్రమౌళి తదితరులున్నారు.

ఓదెల: తహసీల్‌ కార్యాలయం ఆవరణలో బీఆర్‌ అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  అలాగే కొలనూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వేడుకలను చేపట్టారు. కార్యక్రమాల్లో మాటూరి రత్నం, తహసీల్దార్‌ రాంమోహన్‌, నయాబ్‌ తహసీల్దార్‌ వసంతరావు, ఏపీఎం లతామంగేశ్వరి, గిర్దావర్లు వినయ్‌కుమార్‌, రాజేందర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీవాణి, సుమన్‌, రమేశ్‌, నాయకులు డిల్లీ శంకర్‌, దొడ్డె శంకర్‌, పాకాల సంపత్‌రెడ్డి, కుంచం మల్లయ్య, మాటూరి నర్సయ్య తదితరులున్నారు.    

యైటింక్లయిన్‌ కాలనీ : ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో సిబ్బందితో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను జీఎం సురేశ్‌ చేయించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, సాంబయ్య, ప్రదీప్‌కుమార్‌,  రాధాకృష్ణారావు, రామకృష్ణ, పద్మారావు, మురళీకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, వంశీధర్‌, డాక్టర్‌ రమేశ్‌బాబు తదితరులున్నారు.

ఫర్టిలైజర్‌సిటీ : గోదావరిఖని ఆరో అదనపు జిల్లా న్యాయస్థానంలో రాజ్యాంగ దినోత్సవాన్ని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి బీవీఎన్‌ భారతి లక్ష్మి హాజరై మాట్లాడారు. ఇక్కడ  మేడ చక్రపాణి,  దేశెట్టి అంజయ్య, బూస గణపతి, సంజయ్‌ కుమార్‌ ఉన్నారు.