బుధవారం 20 జనవరి 2021
Peddapalli - Nov 27, 2020 , 00:48:06

ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి

ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి

గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులందరూ సమష్టిగా సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టును గురువారం ఆయన సందర్శించారు. ఈ మేరకు ప్రాజెక్టులో ఓవర్‌ బర్డెన్‌ (ఓబీ) తరలింపు, బొగ్గు ఉత్పత్తి పనులను మ్యాప్‌ ద్వారా సమీక్షించారు. మేడిపల్లి ఓసీపీలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఉత్పత్తి, ఉత్పాదకత పనులను వేగవంతంగా చేపట్టాలని, రక్షణ చర్యలను పాటించాలని జీఎం నారాయణ, పీవో సత్యనారాయణకు సూచించారు.

రామగిరి: డైరెక్టర్‌ (ఆపరేషన్‌) ఆర్జీ-3 డివిజన్‌లో పర్యటించారు. ఏరియా పరిధిలోని సీహెచ్‌పీ, సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణం పనులను ఆర్జీ-3 జీఎం సూర్యనారాయణతో కలిసి పరిశీలించారు. సమ్మె కారణంగా డివిజన్‌ పరిస్థితులను అధ్యయనం చేశారు. సీహెచ్‌పీ వద్ద అత్యవసర బొగ్గు రవాణా ఎలా కొనసాగుతుందో పరిశీలించారు. 50 మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటి దాకా పూర్తయిన 15 మెగావాట్ల సౌర విద్యుత్‌, స్థానిక 132 కేవీ సబ్‌ స్టేషన్‌కు అనుసంధానం చసి విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మిగతా 35 మెగావాట్ల అభివృద్ధి పనులను కూడా వచ్చే నెల ఆఖరి దాకా పూర్తి చేసి 132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్‌ రామలింగం, పీవో శ్రీనివాసరావు తదితరులున్నారు.logo