సమ్మె సంపూర్ణం.. విజయవంతం

- కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఉద్యోగులు, కార్మికుల మద్దతు
- నిరసన ప్రదర్శనలు
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మిక వర్గం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. విధులకు దూరంగా ఉండి ఐక్యత చాటింది. కార్మిక చట్టాల సవరణ సరికాదని, వాటాల ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
గోదావరిఖని: సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు గోదావరి ఖనిలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆర్జీ-1 జీఎం కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఉపేందర్, కొంరయ్య, మల్లయ్య, రాజయ్య, రవి, సమ్మయ్య, శ్రీనివాస్, ఈశ్వర్, శాంత, స్వరూప, రాజేశ్వరి, రాణి, స్వప్న, సునీత, వినోద, సంజీవ్, శ్రీకాంత్ తదితరులున్నారు. ఆర్జీ-1లో సమ్మె సంపూర్ణంగా కొనసాగింది. గురువారం ఉదయం షిఫ్టు నుంచే భూగర్భ, ఉపరితల గనులు కార్మికులు లేక బోసిపోయి కనిపించాయి. గనులు, డిపార్ట్మెంట్లు, దవాఖానలు, వివిధ విభాగాల్లో మొదటి షిఫ్టులో 3583 మందికి 877 మందితో 24 శాతం హాజరు శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జనరల్ షిఫ్టులో 2069 మంది కార్మికులకు గానూ 422 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. అలాగే 1164 మంది కాంట్రాక్ట్ కార్మికులకు గానూ 712 మంది హాజరయ్యారు. అలాగే రెండో షిఫ్టులో 883 మంది కార్మికులకు గానూ 258 మంది మాత్రమే కార్మికులు హాజరు కాగా, 378 మంది కాంట్రాక్ట్ కార్మికులకు గానూ 145 మంది హాజరైనట్లు తెలిపారు. బొగ్గు ఉత్పత్తికి భారీగా విఘాతం కలిగింది. ఉదయం నుంచే పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గనులపైకి చేరుకొని బందోబస్తు చర్యలు చేపట్టారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చి చౌరస్తాలో ధర్నా చేశారు. ఇక్కడ ఐఎఫ్టీయూ నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేశ్, తోకల రమేశ్, సత్యనారాయణ, చిలుక శంకర్, దుర్గయ్య, యూసుఫ్, సాంబయ్య, ఎల్లయ్య, సమ్మయ్య, ప్రసాద్ తదితరులున్నారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆర్జీ-1 పరిధిలోని బొగ్గు గనుల వరకు బైక్ ర్యాలీ తీశారు. అలాగే ఏఐటీయూసీ ఆర్జీ-1 ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. గోదావరిఖనిలోని యూనియన్ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ అన్ని గనులు, ఓసీపీల వరకు కొనసాగింది.
రామగిరి : ఆర్జీ-3 ఓసీపీ -1,2, ఏఎల్పీ గనుల్లో కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజర్ కావడంతో గనులన్నీ బోసిపోయాయి. గనులపై పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. టీబీజీకేఎస్ ఆర్జీ - 3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, నాయకులు దేవ శ్రీనివాస్, ఉప్పుల వెంకటేశ్వర్లు, మామిడి స్వామి, దాసరి మల్లేశ్, ఏఐటీయూసీ ఆర్జీ -3 బ్యాంచి సెక్రటరీ జూపాక రాంచందర్, సీఐటీయూ నాయకులు కొమురయ్య, ఐఎఫ్టీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ-3లో గురువారం మొదటి షిఫ్టులో కార్మికులు సమ్మెకు మద్దతుగా విధులకు హాజరుకాలేదు. దీంతో అన్ని గనులు, ఓసీపీలు కార్మికులు లేక బోసిపోయి కనిపించాయి. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్జీ-3లో నాయకులు, కార్మికులు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్, మల్లయ్య, మోహన్, లక్ష్మి, కనకలక్ష్మి, మోహన్, నాగరాజు, సావిత్రి, శేఖర్, శ్యామల తదితరులున్నారు.
మంథని టౌన్: మంథని మున్సిపల్ కార్మికులు సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యం లో మంథని అంబేద్కర్ చౌక్‌లో నిరసన, ర్యాలీ తీశారు. కార్యక్రమంలో నాయకులు బూడిద గణేశ్, శ్రీనివాస్, రాజయ్య, గట్టయ్య, మల్లేశ్, కమల, భాగ్యలక్ష్మి, రాజమ్మ తదితరులున్నారు.
జ్యోతినగర్(రామగుండం): సీఐటీయూ రామగుండం మండల కమిటీ ఆధ్వర్యంలో జీరో పాయింట్ నుంచి మసీద్ టర్నింగ్ అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ తీశారు. ఇక్కడ నాయకులు వేల్పుల కుమారస్వామి, శ్రీనివాస్, తుంగపిండి మల్లేశ్, వై సత్యనారాయణ, శ్యాం, అంజయ్య, రఫీక్, శ్రీను, ఎం ఎల్లయ్య, ఎం పోశం, సతీశ్, మల్లేశ్, కృష్ణ, ఏడుకొండలు, నర్సయ్య ఉన్నారు. అలాగే కుందనపల్లిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రామగుండం డిపో ఎదుట సీఐటీయూ కోశాధికారి ఎం రామాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగ, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఉద్యోగ సంఘాల నాయకులు ఐక్య కార్యాచరణగా ఏర్పడి నెంబర్ వన్ గేట్ వద్ద నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్(ఐఎన్టీయూసీ) నాయకులు కందుల స్వామి, ఆరెపల్లి రాజేశ్వర్, బండారి కనకయ్య, ఆరెపల్లి లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొనగా, సీఐటీయూ. హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు రాజు, సారయ్య, ఇంద్రాచారి, కోట మల్లేశ్, అనంత్‌రెడ్డి, గట్టయ్య, సమ్మిరెడ్డి ఉన్నారు. అలాగే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు లేబర్ గేట్ వద్ద ఉదయం 5గంటల నుంచి 10గంటల వరకు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్, భూషణం, లక్ష్మారెడ్డి, రాఘవరెడ్డి, రాజ్‌కుమార్, భూమయ్య, సంపత్, మనోహర్, వెంకన్న, రాజేశం, నర్సయ్య, రవి, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఇక్కడ థర్మల్ కేంద్రం అసిస్టెంట్ ఇంజినీర్ పురుషాత్తం, 1104, 327, 1535, హెచ్-58, 1245 యూనియన్ల నాయకులు ఉన్నారు. అలాగే రామగుండం రైల్వే స్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ యూనియన్ రామగుండం బ్రాంచీ సెక్రటరీ ఏ వీరన్న నాయక్, అసిస్టెంట్ సెక్రటరీ రాజ్‌కుమార్, శ్రీధర్, లింగమూర్తి, గిరిధర్, రవికిరణ్, ప్రవీణ్ ఉన్నారు.
యైటింక్లయిన్ కాలనీ: ఆర్జీ-2 ఏరియాలోని అన్ని గనులపై టీబీజీకేఎస్, ఇతర యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె చేశారు. సమ్మెలో టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, కొత్త సత్యనారాయణరెడ్డి, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎట్టెం కృష్ణ, రావుల బానాకర్, కర్క శ్రీనివాస్, ఆకుల రాజయ్య, బేతి చంద్రయ్య, ఆవునూరి రాజేశం, అనిల్ తదితరులున్నారు. సమ్మెతో ఆర్జీ-2 పరిధిలో మొదటి షిప్టులో 24వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఓసీపీ-3లో 1240 మందికి కార్మికులకు 88మంది, వీకేపీలో 384మందికి 40, 7ఎల్ఈపీలో 416మందికి 44, ఇతర డిపార్టుమెంట్లలో 365 మందికి 187మంది అత్యవసర విభాగం కార్మికులు మాత్రమే మొదటి షిప్టు విధులకు హాజరయ్యారు. టూటౌన్ సీఐ కూచన శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్: పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా ప్రదర్శన ర్యాలీ తీసి, అనంతరం ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేశ్, ఏఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజాఫంట్, పీవైఎల్, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, బ్యాంకు సంఘాల నాయకులు పూసాల రమేశ్, శనిగల శ్రీనివాస్, గడ్డం జ్యోతి, కొమురయ్య, చంద్రయ్య, తోకల రమేశ్, దుర్గయ్య, ఈదునూరి రామక్రిష్ణ, జిల్లెల ప్రశాంత్, గుమ్మడి కుమారస్వామి, సలిగంటి రామలక్ష్మి, శరత్‌రెడ్డి, వెంకటస్వామి, సదానందం, రాజేశం, ఉమారాణి, ఓదెలు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జంక్షన్: ఎల్ఐసీ ఉద్యోగులు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మద్దతు పలికి మాట్లాడారు. అలాగే పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారయణ, విద్యాసాగర్ ఉన్నారు.
ఓదెల: మండల కేంద్రంలో సీఐటీయూ నిరసన ప్రదర్శన చేపట్టింది. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రాంమోహన్‌కు అందజేసింది. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, స్వామి, సదానందం తదితరులు న్నారు.
జూలపల్లి : మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులు, హమాలీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు ర్యాలీ తీస్తూ తహసీల్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సుధాకర్‌కు వినతి పత్రం అందజేశారు.
అంతర్గాం: మండల కేంద్రంలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న, ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, సీఐటీయూ నాయకుడు శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల నాయకులు ఆడెపు శంకర్, కోడిపుంజుల భూమేశ్, దూలం సతీశ్, మేరుగు గురువయ్య, పీ మల్లారెడ్డి,అంజయ్య, మొండయ్య, రామ్ నాయక్, రాజకొమురయ్య తదితరులున్నారు.
సుల్తానాబాద్: సుల్తానాబాద్‌లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రైస్ మిల్ ఆపరేటర్లు, వర్కర్స్, లారీ అసోసియేషన్, భవన నిర్మాణ కార్మికులు, ఫ్లంబర్స్, మేస్త్రీలు, మున్సిపల్, ఆటో యూనియన్ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ కట్టెకోళ్ల రాజు, తాండ్ర అంజయ్య, కోటారి సంపత్, పాక మహేశ్, చారి, సంపత్, నల్ల శ్రీనివాస్, సురేశ్, శీలం నర్సయ్య, కోటారి రాజు, రౌతు రవీందర్, హకీం కల్వల అంజయ్య తదితరులున్నారు.
పెద్దపల్లి జంక్షన్: అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ తెలంగాణ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ధర్మారం: మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా నాయకుడు బత్తిని సంతోష్ ఆధ్వర్యంలో ఏఎంసీ తహసీల్దార్ కార్యాలయం దాకా హమాలీలు, కూలీలు, గ్రామ పంచాయతీ కార్మికులతో ర్యాలీ తీశారు. అనంతరం తహసీల్దార్ సంపత్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు మేడవేని రాజలింగు, హమాలీలు మేడవేని సుధాకర్, మేడవేని రమేశ్, దడ్వాయిలు కారంగుల కరుణాకర్, బీ లచ్చయ్య, ఎస్ ధర్మయ్య, కూనమల్ల అశోక్, వడ్కాపురం శ్రీనివాస్, రాజేందర్, రమేశ్, బైన్వాల్ శకుంతల, శ్రీనివాస్, లచ్చయ్య, కూలీలు కాంపెల్లి లక్ష్మి, బొల్లి రమ, గాజుల నర్సమ్మ, జేరిపోతుల రాజమ్మ, శంకరమ్మ తదితరులున్నారు.
ఫర్టిలైజర్‌సిటీ: ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రా మాలైన వీర్లపల్లి, ఎల్కలపల్లి, లక్ష్మీపురం ప్రజలు స్థానిక నిరుద్యోగ యువత ఆర్ఎఫ్సీఎల్ గేటు వద్ద నిరసన తెలిపారు. ఇక్కడ నాయకులు రాంకిషన్, రవీందర్, విశ్వనాథ్, వెలుతురు మల్లయ్య, రాజేందర్, రాజేశ్వర్, వెంకటరెడ్డి, బొడ్డుపల్లి నారాయణ, ఉపసర్పంచ్ నర్సింగం, మాజీ సర్పంచ్ రాజ్‌కుమార్, జీఏవీ ప్రసాద్, రవి తదితరులున్నారు. అలాగే గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులు ర్యాలీ తీశారు. ఇక్కడ సునీల్, రజనీ, జమున, పద్మ, సతీశ్, అన్వర్, రాంబాబు, రవి, బాలరాజు, పద్మ, సువర్ణ, చంద్రకళ తదితరులున్నారు.