విద్యార్థులు నష్టపోకుండా చూడాలి

రౌండ్‌టేబుల్ సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి
పెద్దపల్లిరూరల్: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని తద్వారా విద్యార్థులు చదువుకొనే అవకాశాన్ని కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేప ట్టాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మండల విద్యావనరుల కేంద్రంలో బుధవా రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాల రీత్యా కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్లు, స్వీపర్లను నియమించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ సమస్యలను వెం టనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విద్యాబోధనతో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియో గించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాస్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్రీడలతోనే మానసిక ఉల్లాసం
- నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
- ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల పంజా
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్