ఆదివారం 17 జనవరి 2021
Peddapalli - Nov 26, 2020 , 01:07:04

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

డిసెంబర్‌లోగా ప్రారంభానికి సిద్ధం చేయండి

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వినోద్‌

సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు, శ్మశానవాటిక పనులపై సమీక్ష

పెద్దపల్లిరూరల్‌: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా  చేపట్టిన  పల్లెప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వినోద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మండలపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పల్లెప్రగతి పనుల్లో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు, శ్మశాన వాటికల నిర్మాణాలు, ఇతర పనులపై   సంబంధిత అధికారులతో మండలాల వారీగా సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లా వ్యాప్తంగా మండలాలు గ్రా మాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారిగా సంబంధిత అధికారు లు సిబ్బందిని అభివృద్ధ్ది పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఎమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.   సమావేశంలో పెద్దపల్లి, మంథని ఉపా ధి హామీ ఏపీడీ  రాజు, వెంకటేశ్వర్లుతో పాటు జిల్లాలోని వివిధ మండలాల ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.