దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు

- టీబీజీకేఎస్ నాయకులు
- పలు సంఘాల ఆధ్వర్యంలో గేట్‌మీటింగ్‌లు, సమావేశాలు
గోదావరిఖని: ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు టీబీజీకేఎస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ యూనియన్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు, రీజినల్ సెక్రటరీ కనకం శ్యాంసన్ తెలిపారు. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-11వ గనిపై మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను సవరించి కార్మికులు, కార్మిక సంఘాల ఉనికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పిట్ సెక్రటరీ నాయిని శంకర్ అధ్యక్షతన చేపట్టిన సమావేశంలో నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, నాయిని మల్లేశం, పుట్ట రమేశ్, కృష్ణమూర్తి, యాదవరెడ్డి, గుమ్మడి లింగయ్య, రామస్వామి, ముడుసు రమేశ్, సురేందర్, తిరుపతి, భాస్కర్, గట్టయ్య, అంజయ్య, లింగయ్య తదితరులున్నారు.
సింగరేణి బంగ్లా ఏరియా, సీఎస్పీ రైల్వే కార్మికుల వద్ద జరిగిన గేట్ మీటింగులో ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేశ్, జిల్లా అధ్యక్షుడు ఈ నరేశ్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అంబానీ, ఆదాని సంస్థలకు అమ్మివేస్తున్నదని ఆరోపించారు. ఇక్కడ నాయకులు శ్రీధర్, వెంకటేశ్, రాజేందర్, సమ్మయ్య, సారయ్య, పోశం, కనకయ్య, వాసుదేవరెడ్డి, మధునమ్మ, ప్రమీల ఉన్నారు.
యైటింక్లయిన్ కాలనీ: ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3లో గేట్ మీటింగ్‌లో టీబీజీకేఎస్ ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ మాట్లాడారు. సమావేశంలో నాయకులు చంద్రయ్య, దేవ వెంకటేశం, కొత్త సత్యనారాయణ రెడ్డి, శంకర్ నాయక్, ఎట్టం కృష్ణ, రావుల బానాకర్, సిరంగి శ్రీనివాస్, కర్క శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, ఆకుల రాజయ్య, రాజేశం, బొద్దుల నర్సయ్య, గణేశ్, గట్టయ్య ఉన్నారు.
‘ఐలు’ మద్దతు
ఫర్టిలైజర్‌సిటీ: సమ్మెకు అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చందాల శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మెను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
రామగిరి: ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2లోగేట్ మీటింగ్‌లో సీఐటీయూ నుంచి దొమ్మాటి కొంరయ్య, ఏఐటీయూసీ నుంచి వైవీ రావు, ఐఎన్టీయూసీ నుంచి రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. సమ్మెను భగ్నం చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో జేఏసీ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, రాంచందర్, రామ్మూర్తి, కుమార్, జగదీశ్, రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు, రాజు, యాకుబ్, శ్రీనివాస్, రాజయ్య, దేవేంద్రాచారి, వెంకటస్వామి, రాయమల్లు, కామేశ్వరరావు తదితరులున్నారు.
కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలి
సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ వెంకన్న పిలుపునిచ్చారు. ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1లో గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. సమావేశంలో నాయకులు మనోజ్, మల్లయ్య, మోహన్, శంకర్, శరత్, నాగరాజు, రాజు, కనకలక్ష్మి, మోహన్, నాగరాజు, మల్లేశ్ తదితరులున్నారు.
జ్యోతినగర్: సమ్మెను ఎన్టీపీసీలో విజయవంతం చేయాలని ఎన్టీపీసీ కాంట్ట్రాక్ కార్మిక సంఘాల జేఏ సీ నాయకులు ప్రచారం చేశారు. ప్లాంటులో భోజన విరామ సమయంలో కాంట్రాక్ట్ కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఇక్కడ చిలుక శంకర్, నాంసాని శంకర్, లక్ష్మారెడ్డి, భూమయ్య, నాగభూషణం, ఆర్ లక్ష్మణ్, శ్రీనివాస్ ఉన్నారు.
సమ్మెలో పాల్గొనాలని సీఐటీయూ ఎన్టీపీసీ పట్ట ణ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. మేడిపల్లి సెంటర్, ట్రాలీ, ఆటో రిక్షా, టాక్సీ రంగాలకు చెందిన కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఇక్కడ ట్రాలీ అసోసియేషన్ నాయకులు అక్రం, అజ్మత్, ఆటో యూనియన్ నాయకులు లింగయ్య, రమేశ్ తదితరులు ఉన్నా రు. ఎన్టీపీసీలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సమ్మె సన్నాహాక సమావేశం నిర్వహించింది. ఎన్టీపీసీలో సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ చిలుక శంకర్, సత్యనారాయణరెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు