శనివారం 16 జనవరి 2021
Peddapalli - Nov 25, 2020 , 00:55:06

వాట్సాప్‌లో బెదిరింపు మెసేజ్‌లు

వాట్సాప్‌లో బెదిరింపు మెసేజ్‌లు

పెద్దపల్లిరూరల్‌: వాట్సాప్‌లో మెసేజ్‌లు బెదిరింపులకు పాల్పడుతున్న ఒకరిపై కేసు నమోదు చేసి పెద్దపల్లి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు బసంత్‌నగర్‌ ఏఎస్‌ఐ రాజయ్య తెలిపారు. పెద్దపల్లి మండ లం అందుగులపల్లికి చెందిన దొమ్మాటి సదయ్య అదే గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ భర్త తలారి సాగర్‌పై వాట్సాప్‌లో అసభ్యకర బెదిరింపు మెసేజ్‌లు పెడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.

పరిహారం చెల్లించాకే తీసుకెళ్లాలి

పెద్దపల్లిరూరల్‌: ధ్వంసమైనట్రాక్టర్‌కు పరిహారం చెల్లించిన తర్వాతే డీజిల్‌ ట్యాంకర్‌ను తీసుకెళ్లాలంటూ రాంపల్లి సర్పంచ్‌ కనపర్తి శ్రీలేఖ ప్రభాకర్‌ రావు, నాయకులు, గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశా రు. నాలుగు రోజుల క్రితం డీజిల్‌ ట్యాంకర్‌.. ప్రభాకర్‌రావు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయిన విషయం తెలిసిందే. పోలీసులు చేరుకొని ట్యాంకర్‌ను తరలించి, బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.