శనివారం 16 జనవరి 2021
Peddapalli - Nov 25, 2020 , 00:55:12

జీడీకే-11వ గని భవిష్యత్‌పై సమీక్ష

జీడీకే-11వ గని భవిష్యత్‌పై సమీక్ష

గోదావరిఖని: ఆర్జీ-1 పరిధిలోని జీడీకే-11వ గని భవిష్యత్‌పై డైరెక్టర్‌ ఆపరేషన్‌ చంద్రశేఖర్‌ సమీక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో జీఎం నారాయణ, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 11వ గని భవిష్యత్‌లో సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకతపై చర్చించారు. గనిలోని పని స్థలాలను మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. కంటిన్యూయస్‌మైనర్‌ యంత్రం ద్వారా నిర్దేశించిన రోజు వారి ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని స్థలంలో తగిన రక్షణ చర్యలు పాటిస్తూ  విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.