గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Nov 23, 2020 , 01:25:29

స్వయం ఉపాధే ‘విజయమ్మ’ లక్ష్యం

స్వయం ఉపాధే ‘విజయమ్మ’ లక్ష్యం

రామగుండంలోని పలు డివిజన్లలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాల ప్రారంభం

గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను కార్పొరేటర్లు ప్రారంభించారు. 28, 34 డివిజన్లలో మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలను కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్‌, జంజర్ల మౌనిక హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌  పులెందర్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సతీమణి విజయమ్మ ఆశయ సాధనలో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాల్లో మహిళలు నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం సొంత యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. కుట్టు శిక్షణ కాలం అనంతరం ఫౌండేషన్‌ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ బాధ్యుడు శ్యాంకుమార్‌ తదితరులున్నారు.