శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Nov 23, 2020 , 01:25:28

క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలి

క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమతారెడ్డి
  • పెద్దపల్లి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ షురూ

పెద్దపల్లి టౌన్‌: ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమతారెడ్డి పిలుపునిచ్చారు. నల్లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో పెద్దపల్లి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం ఆమె ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంత రం మమతారెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి ప్రీమియర్‌ లీగ్‌ను పెద్దపల్లిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యు వతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు నల్లా ఫౌండేషన్‌ సభ్యులు ముందుకు వచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం నల్లా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపు, ఓటమిని ఒకేలా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ బాలాజీ పంప్‌హౌస్‌ నిర్వాహకుడు పడాల సతీశ్‌గౌడ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు రూ.10వేలు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొంతం శ్రీనివాసరెడ్డి, కానుకుర్తి కార్తిక్‌, రేవెల్లి స్వామి, కొలిపాక శ్రీనివాస్‌, టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ సాబీర్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొయ్యడ సతీశ్‌గౌడ్‌, పెంచాల శ్రీధర్‌, తాళ్లపల్లి మనోజ్‌, పీఈటీలు కిష్టయ్య, షఫీ తదితరులు పాల్గొన్నారు.