శుక్రవారం 04 డిసెంబర్ 2020
Peddapalli - Nov 22, 2020 , 01:44:56

మాట నిలబెట్టుకుంటున్న ‘కోరుకంటి’

మాట నిలబెట్టుకుంటున్న ‘కోరుకంటి’

  • నిరుపేద అవ్వకు ఇంటి నిర్మాణం   
  • భూమిపూజ చేసిన రామగుండం నగర మేయర్‌

గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఓ అవ్వకు ఇచ్చిన మాటను నిలబెట్టునేందుకు సిద్ధమయ్యారు. ఇల్లు నిర్మించి ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు శనివారం మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ద్వారా భూమిపూజ చేయించారు. కొన్ని రోజుల కిందట గోదావరిఖనిలోని అంబేద్కర్‌నగర్‌లో పర్యటించినప్పుడు స్థానికంగా ఉండే నిరుపేద వృద్ధురాలైన యతిరాజ్‌ గంగమ్మను పలుకరించగా.. తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆమె గోడును వెల్లబోసుకున్నది. దీంతో చలించిన ఎమ్మెల్యే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నా విజయమ్మ ఫౌండేషన్‌ ద్వారా ఇల్లు నిర్మించాలని తపించారు. తాను అందుబాటులో లేని కారణంగా మేయర్‌ చేతుల మీదుగా భూమి పూజ చేయించారు. ఆమె ఇంటికి ‘విజయమ్మ నిలయం’గా నామకరణం చేయించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సిద్ధం కావడంతో గంగమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఆయన కొడుకు సల్లంగ ఉండాలంటూ దీవించింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు అబ్బ రమేశ్‌, కూసం శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గాజె సతీశ్‌, నాయకులు మండ రమేశ్‌, చింతల సతీశ్‌, మంథని లింగయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.