బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Nov 21, 2020 , 02:35:23

బాలల హక్కుల పరిరక్షణకు కృషి

బాలల హక్కుల పరిరక్షణకు కృషి

  • అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ 
  • పోటీల్లో విజేతలకు బహుమతుల పంపిణీ

పెద్దపల్లి జంక్షన్‌: బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. చైల్డ్‌లైన్‌ సే దోస్తీ వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా చేపట్టగా, ముగింపు ఉత్సవాలను జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. డ్రాయింగ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ముత్తారం, కాల్వశ్రీరాంపూర్‌ కేజీబీవీ విద్యార్థినులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో డీఈవో జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇన్‌చార్జి సంక్షేమ అధికారి సుగుణ తదితరులున్నారు.

సంతకాల సేకరణ.. 

చైల్డ్‌ లైన్‌ సే దోస్తీ, బాలల హక్కుల వారోత్సవాల్లో బాల ల హక్కుల పరిరక్షణకుగాను కలెక్టరేట్‌లో సంతకాల సేకరణ బోర్డు ఏర్పాటు చేశారు. దానిపై అదనపు కలెక్టర్‌, డీఈవోతోపాటు పలు శాఖ అధికారులు సంతకాలు చేశారు.

సంరక్షణ అందరి బాధ్యత

ధర్మారం: బాలల సంరక్షణ సమాజంలోని అందరి బాధ్యత అని బాలల సంక్షేమ సమితి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చైర్‌ పర్సన్‌ కొమురయ్య పేర్కొన్నారు. ధర్మారం తహసీల్‌ కార్యాలయంలో చైల్డ్‌ లైన్‌ 1098 జిల్లా శాఖ కోఆర్డినేటర్‌ ఉమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సమావేశం తహసీల్దార్‌ సంపత్‌ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి కొమురయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిషేధం చట్టం-2006 పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు. బాలల హక్కుల సంరక్షిస్తామంటూ సంతకాలు చేశా రు. కార్యక్రమంలో ఐసీపీఎస్‌ లీగల్‌ కమ్‌ ప్రొఫెషనల్‌ అధికారి రజిత, డీటీ ఆంజనేయులు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జమున, ఎంపీవో శంకరయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ అంజయ్య, జిల్లా లేబర్‌ కార్యాలయం డీఈవో ఎం లవణ్‌, ఐకేపీ ఏపీవో రవి, కేజీబీవీ ఎస్‌వో విజయలక్ష్మి, వీఆర్వోలు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

విజేతలకు సన్మానం

జ్యోతినగర్‌(రామగుండం): పోటీల్లో గెలిచి అదనపు కలెక్టర్‌ నుంచి బహుమతులు అందుకున్న తబితా ఆశ్రమ పిల్లలు లక్ష్మి, మానస, సోని, అశోక్‌ను ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్రనాయక్‌ శాలువాలతో సన్మానించారు.