సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Nov 21, 2020 , 02:28:54

బంగారు పోచమ్మ గుడికి భూమిపూజ

బంగారు పోచమ్మ గుడికి భూమిపూజ

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రంగాపూర్‌ శివారులో పురాతన బంగారు పోచమ్మ గుడి పునర్నిర్మాణానికి సర్పంచ్‌ ఆడెపు వెంకటేశం శుక్రవారం భూమిపూజ చేశారు. పూర్వం పోచమ్మ గుడిని నిర్మించిన కొండ రామమ్మ, కొమురయ్య కొడుకులు మళ్లీ కట్టేందుకు ముందుకు రావడంతో రాఘవాపూర్‌, రంగాపూర్‌ సర్పంచులు ఆడెపు వెంకటేశం, గంట లావణ్య రమేశ్‌ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అలాగే గుడి నిర్మాణానికి రాఘవాపూర్‌ సర్పంచ్‌ ఆడెపు వెంకటేశం రూ.50 వేలు విరాళంగా అందించారు. ఇక్కడ కొమురయ్య కుమారులు వెంకటరమణ, మల్లికార్జున్‌, రాజు తదితరులున్నారు.