గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Nov 21, 2020 , 02:28:52

కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి

  • మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ 
  • పోచమ్మవాడలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

మంథని టౌన్‌: రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ పిలుపునిచ్చారు. మంథని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని పోచమ్మవాడ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, సాగు నీటి ఇబ్బందులు దూరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాని పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. రైతుల కండ్లలో ఆనందాన్ని నింపిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంటను రైతులు అమ్ముకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీరాంభట్ల సంతోషిణి, కౌన్సిలర్లు వీకే. రవి, గర్రెపల్లి సత్యనారాయణ, శ్రీపతి బానయ్య, గుండా లక్ష్మీపాపారావు, కోఆప్షన్‌ సభ్యుడు రాధాకృష్ణ తదితరులున్నారు.