శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Nov 20, 2020 , 02:53:21

డిసెంబర్‌ 31లోగా సీఎంఆర్‌ను సరఫరా చేయాలి

డిసెంబర్‌ 31లోగా సీఎంఆర్‌ను సరఫరా చేయాలి

ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతీ హోళికేరి

పెద్దపల్లి జంక్షన్‌: జిల్లాలో 2019-20 వానకాలం, యాసంగి పంటలకు సంబంధించిన కస్టం మిల్లింగ్‌ రైస్‌ను డిసెంబర్‌ 31వ తేదీలోగా మిల్లర్లు ఎఫ్‌సీఐ గోదాంలకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశించారు. సీఎంఆర్‌ సరఫరాపై సం బంధిత అధికారులు, రైస్‌ మిల్లర్లతో గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైస్‌ మిల్లర్లు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా బి య్యాన్ని అందించాలని సూచించారు. యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 1.65 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను  గడువులోగా ఎఫ్‌సీఐ గోదాంలకు పంపించాలని రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. అలాగే గతేడాది వానకాలం పంటకు సంబంధించి 5,18,101 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌కు గాను ఇప్పటి వరకు 3.53 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశారని పేర్కొన్నారు. యంత్రాలు, హమాలీలు, ఇతర సమస్యల పరిష్కారం, లక్ష్య సాధన దిశగా అనుసరించే వ్యూ హం, కార్యాచరణకు సంబంధించిన నివేదికను  రైస్‌ మిల్లర్లు అందించాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ ప్రవీణ్‌, అధికారి వెంకటేశ్‌, రైస్‌ మిల్లుర్లు తదితరులున్నారు.