బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Nov 19, 2020 , 02:20:54

క్రిస్టియన్‌ మైనార్టీల సమావేశం

క్రిస్టియన్‌ మైనార్టీల సమావేశం

గోదావరిఖని: గోదావరిఖని నగరంలోని క్రీస్తు ఆలయం చర్చిలో బుధవారం తెలంగాణ క్రిస్టియన్‌ మైనార్టీ అసోసియేషన్‌(టీసీఎంఏ) ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్‌ భవిష్యత్‌ కార్యాచరణతోపాటు క్రిస్టియన్‌ మైనార్టీల సంక్షేమానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా డిసెంబర్‌లో గ్రాండ్‌ క్రిస్మస్‌ సంబురాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. సమావేశంలో అధ్యక్షుడు రాబర్ట్‌ ప్రేమ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌, సీఎస్‌ఐ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ తిమోతి, ఉప కార్యదర్శి జీవరత్నం, నవీన్‌, జోసఫ్‌, రజబ్‌ అలీ, సైమన్‌ రాజ్‌, రవి, రంజిత్‌ తదితరులున్నారు.