శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Nov 19, 2020 , 02:19:37

‘12న మత్స్యవీర కేసీఆర్‌ కప్‌' తెప్పల పోటీలు

‘12న మత్స్యవీర కేసీఆర్‌ కప్‌' తెప్పల పోటీలు

8వ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌

గోదావరిఖని:  గోదావరి నదిలో రెండోసారి రాష్ట్ర స్థాయి ‘మత్స్యవీర కేసీఆర్‌ కప్‌ తెప్పల పోటీలు’ వచ్చే నెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ దాతు శ్రీనివాస్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. మొదట అనుకున్నట్టుగా ఈ నెల 21వ తేదీన చేపట్టాల్సిన ఈ తెప్పల పోటీలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆదేశాల మేరకు అనివార్య కారణాలతో డిసెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరినదిలో తెప్పల పోటీలకు మంత్రులను ఆహ్వానించి వారి సమక్షంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా  కార్యక్రమాలు నిర్వహించుకుంటామన్నారు. తెలంగాణలో ఎక్కడా జరుగని విధంగా గోదావరిఖనిలో రాష్ట్ర స్థాయిలో తెప్పల పోటీలు రెండోసారి నిర్వహించనున్నామని చెప్పారు. ఈ పోటీలకు రాష్ట్రం నుంచేకాకుండా ముంబయి తదితర ప్రాంతాల నుంచి కూడా పోటీదారులు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే చందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మత్స్యవీర కేసీఆర్‌ కప్‌ రాష్ట్ర కన్వీనర్‌ గోలివాడ ప్రసన్నకుమార్‌, సాయివంశీ, వడ్డేపల్లి క్రాంతి, రావులపల్లి కృష్ణ, రవితేజ తదితరులున్నారు.