సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Nov 18, 2020 , 02:31:00

రహదారుల అభివృద్ధికి కృషి

రహదారుల అభివృద్ధికి కృషి

  •   ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
  •   పోతనకాలనీలో సింగరేణి సహకారంతో రూ.8కోట్లతో రహదారి విస్తరణ పనులు

యైటింక్లయిన్‌ కాలనీ: రహదారుల అభివృద్ధికి కృ షి చేస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. పోతనకాలనీలోని ప్రధాన రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం భూమి పూజచేసి ప్రారంభించారు.  సింగరేణి సంస్థ ఆర్జీ-2 జీఎం ఎం సురేశ్‌ అధ్యక్షతన జరిగిన భూమిపూజ కార్యక్రమంలో మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చందర్‌ మాట్లాడుతూ, చిన్నపాటి వర్షానికి కూడా రహ దారి పైనుంచి నీరు పారుతుండడంతో  గోదావరిఖనికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికల సమయంలో పోతనకాలనీ, యైటింక్లయిన్‌ కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు తాను గెలుపొందిన తర్వాత సీఎం కేసీఆర్‌ సహకారంతో సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులకు రూ.8కోట్ల నిధులు మంజూరు చేయించానని చెప్పారు. రోడ్డుతోపాటు జల్లారం వాగుపై వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఈప్రాంత  ప్రజల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని సూ చించారు. సంస్థ అభివృద్ధికి తమవంతు సహకా రం ఉంటుందని, అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎస్‌వోటూ జీఎం సందనాల సాంబయ్య, సివిల్‌ డీజీఎం రామకృష్ణ, అధికార సంఘం డివిజన్‌ అధ్యక్షుడు నర్సింహారావు, టీబీజీకేఎస్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు తాళ్ల అమృతా రాజయ్య, బదావత్‌ శంకర్‌నాయక్‌, బాదె అంజలి భూమయ్య, డీజీఎం(ప) గుండా ప్రదీప్‌కుమార్‌, డీజీఎం(ప) రాజేంద్రప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దుర్గం రాజేశం, జక్కుల దామోదర్‌రావు, ముద్దసాని సంధ్యారెడ్డి, ఎరవెల్లి గోపాల్‌రావు, మధుకర్‌రెడ్డి, మారెల్లి మల్లారెడ్డి, పులి రాకేశ్‌, బైరి నాగమణి, అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు, లక్ష్మణాచార్యు లు తదితరులు పాల్గొన్నారు.