శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Nov 18, 2020 , 02:31:00

మంథని అభివృద్ధికి ప్రత్యేక కృషి

మంథని అభివృద్ధికి ప్రత్యేక కృషి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ
  • పాలకవర్గ సాధారణ సమావేశం

మంథని టౌన్‌: మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్ర త్యేక కృషి చేస్తున్నామని  మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి కమిషనర్‌ కే వేణుగోపాల్‌తో కలిసి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంగళవారం పాలకవర్గ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాల తీర్మానాలను పాలకవర్గ సభ్యులతో కలిసి ఆమోదించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సహాయ సహకారాలతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నుంచి రూ.15 కోట్ల నిధులను విడుదల చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.  మంథని పట్టణంలోని అన్ని వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి నివేదికలు తయారు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతంలో తీర్మానించిన అంశాల ఆమోదంతోపాటు తాజాగా 29 అంశాలపై కౌన్సిలర్లతో కలిసి సమావేశం నిర్వహించామని తెలిపారు. రూ.30 లక్షలతో ఎక్స్‌కవేటర్‌ను కొనేందుకు, రూ.9 లక్షలతో చెత్త ట్రాక్టర్‌, ట్రేలర్లను కొ నేందుకు, రూ.14.70 లక్షలతో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు, తదితర అంశాలపై కౌన్సిల్‌ మీటింగ్‌లో చర్చించి ఆమో దించామని తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి కమిషనర్‌ కే వేణుగోపాల్‌, కౌన్సిలర్లు వీకే. రవి, కుర్రు లింగయ్య, కాయితీ సమ్మ య్య, గర్రెపల్లి సత్యనారాయణ, శ్రీపతి బానయ్య, చొప్పకట్ల హన్మంతు, నక్క నాగేంద్ర, గుండా విజయలక్ష్మి, పెండ్రు రమాదేవి, కొట్టే పద్మ, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్‌కే.యాకుబ్‌, సముద్రాల స్వాతి, గట్టు రాధాకృష్ణ, అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.