మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Nov 17, 2020 , 01:17:11

సాగులో దేశానికి తెలంగాణ ఆదర్శం

సాగులో దేశానికి తెలంగాణ ఆదర్శం

బీజేపీ నాయకులవి అబద్ధాలు

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

యైటింక్లయిన్‌ కాలనీ : సీఎం కేసీఆర్‌ సాగులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేతకాని తెలిపారు. రామగుండం కార్పొరేషన్‌ 18వ డివిజన్‌ అల్లూరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌ తదితరులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల పంటలకు మద్దతు ధర ఇస్తుండడంతోపాటు రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.పథకాలు సఫలమై రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ఇవేమీ గిట్టని బీజేపీ నాయకులు  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

ప్రతి ఎకరాకు సాగు నీరు..

సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరా కు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే చందర్‌ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, మేడిపల్లి సహకార సంఘం చైర్మన్‌ రాజేశం, డైరెక్టర్‌ కళావతి, కార్పొరేటర్లు బాదె అంజలి, శంకర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు దుర్గం రాజేశం, మల్లారెడ్డి, పులి రాకేశ్‌, ముస్కే శ్రీనివాస్‌, మధుకర్‌రెడ్డి, కుమార్‌నాయక్‌ పాల్గొన్నారు.

అన్నదాతల సంక్షేమమే లక్ష్యం 

పాలకుర్తి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని  ఎమ్మెల్యే చందర్‌ పేర్కొన్నారు. జయ్యారం, గుడిపల్లి, పుట్నూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించడంతోపాటు, బసంత్‌నగర్‌, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యారాణి, వైస్‌ ఎంపీపీ ఎర్రంస్వామి, ఏఎంసీ చైర్మన్‌ అల్లం రాజయ్య, మేడిపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, సర్పంచులు చింతకింది నర్సమ్మ, పున్నం శారద తదితరులు పాల్గొన్నారు. 

అంతర్గాం:  మద్దిర్యాల, ఈసంపేట, అకెనపల్లిలో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చందర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ గౌస్‌పాషా, సర్పంచులు సందెల దివ్య మల్లేశం, ఏదులాపురం నీరజ వెంకటేశ్‌, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధూకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అల్లం రాజన్న, వైస్‌ చైర్మన్‌ కోల సంతోష్‌, నాయకులు తిరుపతి నాయక్‌, కొమురయ్య తదితరులున్నారు