సోమవారం 30 నవంబర్ 2020
Peddapalli - Nov 16, 2020 , 01:35:01

బాధిత కుటుంబాలకు పరామర్శ

బాధిత కుటుంబాలకు పరామర్శ

పెద్దపల్లిరూరల్‌: చీకురాయిలో మృతి చెందిన జక్కుల లింగారెడ్డి కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, నల్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్‌ రెడ్డి పరామర్శించి, మృతిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చారు. అలాగే పాలితంలో ఆలేటి ఎల్లయ్య మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించి వారికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. మనోహర్‌రెడ్డి వెంట నాయకులు అట్ల సాగర్‌, మల్లయ్య, తిరుపతి, రాజేశం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌ : మల్యాలలో అరెల్లి కిష్టయ్య, కవ్వంపెల్లి దుర్గమ్మ, పీ రాజమ్మ ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాలను నల్ల మనోహర్‌రెడ్డి పరామర్శించారు. అరెల్లి కిష్టయ్య కుటుంబ సభ్యులకు రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు.ఆయన వెంట మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ఉప సర్పంచ్‌ సుదాటి కర్ణాకర్‌రావు, నాయకులు సువర్ణ బిట్టు, ఎరబాటి రవి, లోనె శ్రీనివాస్‌, రఘుపతిరెడ్డి, జక్కె విష్ణువర్ధన్‌, పంజాల శంకరయ్య, పంజాల సురేశ్‌, కొంకిమల్ల రవి, లక్ష్మారెడ్డి, కామిడి వినయ్‌ తదితరులున్నారు.