గురువారం 26 నవంబర్ 2020
Peddapalli - Nov 16, 2020 , 01:34:59

సహకార వారోత్సవాలు షురూ

సహకార వారోత్సవాలు షురూ

జెండా ఎగురవేసిన విండో చైర్మన్లు

స్వీట్ల పంపిణీ

జూలపల్లి : జిల్లావ్యాప్తంగా సహకార వారోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. జూలపల్లి లోని సింగిల్‌ విండో కార్యాలయంలో సహకార వారోత్సవాలను ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార పతాకాన్ని ఎగుర వేశారు. ఇక్కడ విండో చైర్మన్‌ కొం జర్ల వెంకటయ్య, వైస్‌ చైర్మన్‌ తోట ముత్తులింగం, డైరెక్టర్లు గడ్డం నర్సింహారెడ్డి, గుమ్మడి శంకర్‌, కొమ్మ ఐలయ్య, పొట్టాల బీరయ్య  పాల్గొన్నారు. 

సుల్తానాబాద్‌ :  సుల్తానాబాద్‌ సొసైటీలో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌ జెండావిష్కరించారు. కార్యక్రమంలో డీసీవో నర్సయ్య, పాలక వర్గ సభ్యులు ముద్దసాని సురేశ్‌రెడ్డి, మ్యాకల రాజయ్య, పొతర్ల కమలమ్మ, ఉస్తేం గణేశ్‌, సీఈవో సంతోష్‌కుమార్‌ తదితరులున్నారు. 

కాల్వశ్రీరాంపూర్‌ : కాల్వశ్రీరాంపూర్‌, కూనారం పీఏసీఎస్‌లలో విండో చైర్మన్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి, చైర్మన్లు చదువు రాంచంద్రారెడ్డి, గజవెళ్లి పురుషోత్తం, సీఈవోలు కోలేటి శ్రీనివాస్‌, విజేందర్‌, డైరెక్టర్లు, నాయకులు డొనికెన మొగిలి, కొల్లూరి రాయమల్లు, కొమ్ము గట్టయ్య, బొట్కు రవీందర్‌, కుంభం రాజు, కొట్టె రవీందర్‌, గీట్ల శ్రీలత, కామిడి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, తిరుపతి తదితరులు ఉన్నారు.  

ఎలిగేడు: ఎలిగేడు సింగిల్‌ విండో కార్యాలయ ఆవరణలో సహకార వారోత్సవాల సందర్భంగా జెండాను చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విండో ఆవరణలో గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకరిస్తున్నారని,  ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు నిధులు మంజూరు చేశారని వివరించారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా గోదాం నిర్మిస్తున్నదని చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో విండో ఉపాధ్యక్షుడు చింతిరెడ్డి గణపతిరెడ్డి, పాలకవర్గ సభ్యులు తాటిపల్లి రమేశ్‌, ఏలేటి వెంకటరెడ్డి, కొప్పెర సత్తమ్మ, రెవెల్లి కనుకమ్మ, ఆసంపల్లి రవి, ఆసంపల్లి శంకరమ్మ, దుగ్యాల రాజేశ్వరరావు, దాసరి రాజిరెడ్డి, గౌరవెల్లి పవన్‌కుమార్‌రావు, తీగల కనుకయ్య, తొంటి మధుకర్‌, సీఈవో కేశెట్టి విక్రం ఉన్నారు. 

పెద్దపల్లి జంక్షన్‌:  పెద్దపల్లి పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో చైర్మన్‌ మాదిరెడ్డి నర్సింహారెడ్డి జెం డాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈవో మధు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

మంథని టౌన్‌: మంథని సింగిల్‌ విండో కార్యాలయ ఆవరణలో సహకార జెండాను సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, డైరెక్టర్లు రాజబాపు, లెక్కల కిషన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కుమార్‌, ఎంపీటీసీ ప్రసాద్‌రావు, కౌన్సిలర్లు రవి, వంశీ, యాకుబ్‌, శంకర్‌లాల్‌, పాపారావు, శ్రీనివాస్‌, సీఈవో అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.