బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Nov 14, 2020 , 02:03:14

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి 

కాల్వశ్రీరాంపూర్‌ : కాల్వశ్రీరాంపూర్‌ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు పులి సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, నల్ల ఫౌండేషన్‌ చైర్మన్‌ నల్ల మనోహర్‌రెడ్డి చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక గుండె పోటుకు గురై సత్యనారాయణరెడ్డి మంగళవారం మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని నల్ల మనోహర్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకుడు మృతి చెందిన విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని,బాధిత కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకోవాలని విన్నవించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచులు సుదాటి కర్ణాకర్‌రావు, వడ్లూరి సాగర్‌, విండో చైర్మన్‌ కేతుపెల్లి నర్సింహారెడ్డి, నాయకులు సువర్ణ బిట్టు, పాలకాని కనుకయ్య, అల్లెం శంకర్‌, బైరి కుమార్‌, తొట్ల భిక్షపతి, ధర్ముల రవి, బర్ల తిరుపతి, ఆకుల రవి తదితరులున్నారు.