శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Nov 14, 2020 , 02:03:14

‘గోదావరి కళా సమాఖ్య’కు అవార్డు

‘గోదావరి కళా సమాఖ్య’కు అవార్డు

కోల్‌సిటీ: గోదావరిఖనిలోని గోదావరి కళా సమాఖ్య సంస్థకు ఇండియన్‌ బెస్ట్‌ హ్యుమానిటీ అవార్డు లభించింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొవిడ్‌-19 నేపథ్యంలో కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసినందుకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (హైదరాబాద్‌) సంస్థ వారు ఇండియన్‌ బెస్ట్‌ హ్యుమానిటీ అవార్డుకు ఎంపిక చేశారు. కొవిడ్‌ కారణంగా శుక్రవారం అవార్డును పోస్టల్‌ ద్వారా పంపించగా, సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌ నుంచి అందుకున్నారు. అలాగే సంస్థ పంపించిన స్వర్ణ పతకాన్ని కూడా స్వీకరించారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత కళాకారులు తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిగా సేవలందించారని గుర్తు చేశారు. కళాకారులకు తనవంతుగా సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం కళా సంఘాల సమాఖ్య నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, మేయర్లను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సమాఖ్య కళాకారులు సోగాల వెంకటి, మాధురి, వాసు, కాసిపాక రాజమౌళి, గద్దల శశిభూషణ్‌, నాగుల శ్రీనివాస్‌, రాజేశ్వరరావు, కుమ్మరి సురక్షణ తదితరులున్నారు. 

సుందరంగా తీర్చిదిద్దుతా

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్ల సమస్యలను పరిష్కరించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 33వ డివిజన్‌ పరశురాంనగర్‌ స్వాగత తోరణాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, దొంత శ్రీనివాస్‌, భాస్కర్‌, శివకుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు జేవీ రాజు, శ్రావణ్‌, సందీప్‌ ఉన్నారు.