శనివారం 05 డిసెంబర్ 2020
Peddapalli - Nov 14, 2020 , 02:03:14

కాళోజీ నారాయణరావు వర్ధంతి

కాళోజీ నారాయణరావు వర్ధంతి

కమాన్‌పూర్‌: కాళోజీ నారాయణరావు వర్ధంతిని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో  శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్ర పటానికి ఎంపీపీ రాచకొండ లక్ష్మి, సర్పంచ్‌ నీలం సరిత పూల మాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కాళోజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు, జడ్పీ చైర్మన్‌ ఓఎస్‌డీ సయ్యద్‌సలీమ్‌ అహ్మద్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇంతియాజ్‌,  నాయకులు గుర్రం లక్ష్మీమల్లు, బొజ్జ రాజసాగర్‌, పొనగంటి కనకయ్య, మేడగోని విజయ్‌, జంగపెల్లి రవి, జంగపెల్లి సది, కమ్మగోని అనిల్‌, కాస రవి, నరిగే శంకర్‌, అంబటి కనకయ్య, బేతు కుమార్‌,ఆసం తిరుపతి, సాన సురేశ్‌, రాచకొండ రవి, నీలం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొవ్వొత్తులతో నివాళి

ఓదెల: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగంగా మలి, తుది దశ ఉద్యమాల్లో పాల్గొన్న కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఓదెల మండలం కొలనూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుండేటి ఐలయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కాశవేని నరేశ్‌, రవి, అశోక్‌, యాకయ్య, మోహన్‌రెడ్డి, రమేశ్‌, రాకేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.